ETV Bharat / state

ఆర్టీసీ పార్సిల్‌ కొరియర్, కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఆర్టీసీకి అదనపు ఆదాయం కల్పించేలా పార్సిల్‌ కొరియర్, కార్గో సర్వీసులు ప్రారంభించామని మంత్రి పువ్వాడ అజయ్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో వాటిని ఆయన ప్రారంభించారు.

Minister Puvvada ajay started rtc parcel Courier and Cargo Services
పార్శిల్‌ కొరియర్, కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
author img

By

Published : Jun 19, 2020, 6:03 PM IST

ఆర్టీసీ పార్సిల్, కొరియర్ రంగంలోకి రాష్ట్రంలోని 140 బస్ స్టేషన్లలో 104 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. పార్సిల్ కొరియర్, కార్గో సర్వీసులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రారంభించారు. ఇప్పటికే కార్గో బస్సులను ప్రారంభించామని, ఇప్పుడు పార్శిల్, కొరియర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి అన్నారు. వీటిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు మొబైల్ యాప్​ కూడా త్వరలో అందుబాటులోకి తీసుకోస్తామన్నారు. ఆర్టీసీ ప్రతి రోజు 33 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఆయన అన్నారు. ఆర్టీసీ అంటే సురక్షితం అనే నమ్మకం ఉందని తెలిపారు.

ఆర్టీసీ పార్సిల్‌ కొరియర్, కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

రూ.230 కోట్ల ఆదాయం..

వీటితో మరింత అదనపు ఆదాయం వస్తోందని భావిస్తున్నామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.230 కోట్ల ఆదాయం వస్తోందని అనుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బెవరేజెస్, పౌర సరఫరాల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలు కార్గో, పార్సిల్ సేవలు వినియోగించుకోవాలని లేఖలు రాశామని మంత్రి తెలిపారు. సిటీ బస్సులు, అంతరాష్ట్ర సర్వీసులు నడవడం లేదన్నారు. తద్వారా ఆదాయం తగ్గిపోయిందన్నారు. ఆర్టీసీ బస్సులతో ఇప్పటి వరకు కరోనా వ్యాప్తి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. మేం తీసుకున్న చర్యలే అందుకు కారణమని చెప్పారు.

ఇదీ చూడండి : 'అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్​ శంకుస్థాపన'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.