ETV Bharat / state

కొవిడ్​ తీవ్రత తగ్గాకే సిటీబస్సులు నడుపుతాం: మంత్రి పువ్వాడ - minister puvvada ajay kumar on transportation in telagnana

ఆర్టీసీపై కరోనా తీవ్ర ప్రభావం చూపెట్టింది. గడిచిన ఆరు నెలల్లో ఆర్టీసీకి రూ.1,800ల కోట్ల స్థూలనష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య సమన్యాయంపై అవగాహన వస్తేనే బస్సులు తిప్పుతాం. మరో రెండు రోజుల్లో మహారాష్ట్ర-కర్ణాటకల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు పునరుద్ధరిస్తాం. సిటీ బస్సులను కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతనే నడపాలని నిర్ణయించామంటున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖీ.

minister puvvada ajay kumar spoke on rtc
కొవిడ్​ తీవ్రత తగ్గాకే సిటీబస్సులు నడుపుతాం: మంత్రి పువ్వాడ
author img

By

Published : Sep 23, 2020, 5:13 AM IST

కొవిడ్​ తీవ్రత తగ్గాకే సిటీబస్సులు నడుపుతాం: మంత్రి పువ్వాడ
  • ప్రశ్న : అంతరాష్ట్ర సర్వీసులు, సిటీ బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయి?.. ప్రజలు వాటికోసం ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు?

జవాబు : మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తెలంగాణ అంతరాష్ట్ర సర్వీసులు నడుపుతుంది. వీటిలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్​కు నడుపుతున్నాం. రాష్ట్ర విభజన తర్వాత అంతరాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగలేదు. కొవిడ్ -19 అన్​లాక్ తర్వాత తిరిగి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాం. కిలోమీటర్లు, రూట్లు, బస్సుల వారీగా ఏపీ ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని రూట్లు, ఎన్ని బస్సులు నడిపితే..తెలంగాణ కూడా అదేవిధంగా నడిపేటట్టు.. సమప్రాతిపదికన నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ విధంగా చూస్తే.. లాక్​డౌన్​కు ముందు వరకు ఏపీ ప్రభుత్వం మనకన్నా 1.19 కి.మీలు ఎక్కువగా తిప్పుతుంది. ఏపీఎస్​ఆర్టీసీ హైదరాబాద్ కేంద్రంగా 80శాతం బస్సులు తిప్పుతుంది. అంతరాష్ట్ర సర్వీసుల అంశంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, ఏపీఎస్​ఆర్టీసీ సరిగ్గా స్పందించడంలేదు. ఏపీ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. రెండు, మూడు దఫాలుగా ఎండీలు, ఈడీల స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. కానీ..స్పందన రాలేదు. కిలోమీటర్లు, రూట్లు, బస్సుల వారీగా సమప్రాతిపదికన చర్చలు జరిగితేనే అంతరాష్ట్ర బస్సులు ఏపీ-తెలంగాణ మధ్య తిరుగుతాయి. ఇక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య గతంలోనే ఒప్పందం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలతో ఎటువంటి ఇబ్బందీ లేదు. రెండు, మూడు రోజుల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సర్వీసులు పునరుద్దరిస్తాం. సిటీ బస్సులపై నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత సిటీ బస్సులు నడపాలని అనుకుంటున్నాం. సిటీ బస్సుల్లో ఎక్కువగా నిలబడి, భౌతిక దూరం లేకుండా ప్రయాణిస్తారు. కాబట్టి సిటీ బస్సులు నడిపించే అంశంపై వేచిచూస్తున్నాం.

  • ప్రశ్న: అంతరాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం ఆలస్యం కావడం వల్ల ప్రైవేట్ ఆపరేటర్లకు లాభం చేకూరుతుందని ఆర్టీసీ యూనియన్ నేతలు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు?

జవాబు : అంతరాష్ట్ర ఒప్పందం ఆలస్యం కావడం వల్ల ఏపీఎస్ ఆర్టీసీకి, టీఎస్ ఆర్టీసీకి ఎలాంటి లాభం లేదు. కావాలని కొంతమంది సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తూ..సంస్థ గురించి ఆలోచించని వారిపై నేను స్పందించలేను. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.

  • ప్రశ్న : కార్గో, కొరియర్, పార్సిల్ సర్వీసులకు ఆదరణ ఏవిధంగా ఉంది...?

జవాబు : పార్సిల్, కొరియర్, కార్గో సర్వీసులు ప్రారంభించాలనుకోవడం సీఎం కేసీఆర్ ఆలోచన. నా ఓఎస్డీనీ వీటికి ప్రత్యేక ఆధికారిగా నియమించాను. ప్రస్తుతం వీటికి ప్రతిరోజూ రూ.10లక్షల ఆదాయం వస్తుంది. 140 బస్టాండ్​లలో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో ప్రజలకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లిఫ్​కార్ట్, అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందంపై ఆలోచన చేస్తున్నాం. కొవిడ్​ను అధిగమించాక... వీటిపై ఆదాయం మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. భవిష్యత్​లో వీటి ద్వారా సంవత్సరానికి రూ.70 నుంచి రూ.80 కోట్లు వచ్చే అవకాశముందని అనుకుంటున్నాం. వీటితోపాటు సొంత పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నాం.

  • ప్రశ్న : ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు లాక్​డౌన్ సమయంలో ట్యాక్సులు మినహాయించాలని, అద్దె బస్సుల యజమానులు బకాయిలు చెల్లించాలని ఆందోళనలకు దిగుతున్నారు. వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా..?

జవాబు : అద్దె బస్సుల యజమానులది న్యాయమైన కోరిక. వారికి బకాయిలు చెల్లించాలని ఇవాళే ఆదేశాలు ఇచ్చాం. మార్చి 31 వరకు ఉన్న బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీచేశాం. ఆర్టీసీలో టికెట్​పై వచ్చే ఆదాయం తగ్గేటప్పటికీ.. అద్దె బస్సుల యజమానులకు బకాయిలు సకాలంలో చెల్లించలేకపోయాం. లాక్​డౌన్ సమయంలో రోజుకి రూ.10 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోయింది. ఆవిధంగా గడిచిన 180 రోజుల్లో ఆర్టీసీ రోజుకి రూ.10కోట్ల చొప్పున ఇప్పటి వరకు సుమారు రూ.1,800ల కోట్ల స్థూల నష్టాన్ని చవిచూశాం. సమ్మె తర్వాత పెంచిన చార్జీలతో ఆర్టీసీ కుదుట పడుతున్న సమయంలో కరోనా రావడం వల్ల ఆర్థికంగా ఆర్టీసీ మరింత చితికిపోయింది. ప్రస్తుతం ఆర్టీసీ జీతాలు చెల్లించేందుకు కూడా బడ్జెట్ నుంచి సీఎం కేసీఆర్​కు చెప్పి చెల్లించాల్సి వస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ అంశంలో స్టాపేజ్​పై మెయిల్ లేదా స్వయంగా కానీ.. నోటీసులు ఇచ్చిన వారికి ట్యాక్సుల మినహాయింపు ఆలోచన చేస్తున్నాం. ఈ అంశంపై సీఎం కేసీఆర్​కు నివేదించాం. సీఎం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం.

  • ప్రశ్న : సీసీఎస్​లో నిధులు లేక... ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు? సుమారు మూడేళ్ల నుంచి సీసీఎస్ నిధుల కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు?

జవాబు : సీసీఎస్ నిధులు వాస్తవానికి చెల్లించాల్సింది. కోర్టు కూడా చెల్లించాలని డైరెక్షన్ కూడా ఇచ్చింది. రూ.600 కోట్లు ప్రభుత్వ గ్యారెంటీతో లోన్ తీసుకుని.. సీసీఎస్ బకాయిలు, పీఎఫ్ బకాయిలు కొంత చెల్లించాలని అనుకున్నాం. ఆ సమయంలోనే కరోనా రావడంతో ఆర్టీసీ నిర్వహణకే ఆ నిధులు దాదాపు ఖర్చు చేయాల్సి వచ్చింది. సీసీఎస్ నిధులు చెల్లించేందుకు ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని చూస్తున్నాం.

  • ప్రశ్న : ఆర్టీఏలో ఆన్​లైన్ సేవలపై ప్రజల స్పందన ఎలా ఉంది..?

జవాబు : డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ రెండు మినహా మిగతా ఏ సేవలకు ఆర్టీఏ కార్యాలయాలకు రాకుండా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. వాహనదారులు మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరంలేకుండా చేయాలని చూస్తున్నాం. ఇప్పటికే రవాణాశాఖలో 11 సర్వీసులు ఆన్​లైన్ చేశాం. రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తాం.

  • ప్రశ్న : ఆర్టీసీ ఆదాయానికి ఖర్చుకు వ్యత్యాసం బాగా ఉంది. గాడిన పడే అవకాశాలున్నాయా..?

జవాబు : ఆర్టీసీ గత ఆరు నెలల్లో సుమారు రూ.1800ల కోట్లు నష్టపోయింది. గత ఆరేళ్లుగా సంస్థకు ప్రతి ఏడాది రూ.వెయ్యి కోట్ల నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం కూడా బడ్జెట్ నుంచి రూ.వెయ్యి కోట్లు అందిస్తుంది. ఆర్టీసీకి వచ్చే నష్టం ఇలా భర్తీ అవుతుంది. రాబోయే రోజుల్లో దీన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాం. కరోనా వల్ల కేవలం ఆర్టీసీ మాత్రమే కాదు.. రాష్ట్రంలో, దేశంలో అనేక సంస్థలకు నష్టం వాటిల్లింది.

ఇవీ చూడండి: భూరికార్డుల పారదర్శకత కోసమే ధరణి పోర్టల్‌కు శ్రీకారం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.