ETV Bharat / state

'అసెంబ్లీకి వచ్చే అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు' - సెప్టెంబర్​ 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉన్నతాధికారులతో మండలి ఛైర్మన్‌, అసెంబ్లీ స్పీకర్‌ సమీక్షించారు. సమావేశాలకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీకి వచ్చే అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తమని వెల్లడించారు.

ts assembly sessions
ts assembly sessions
author img

By

Published : Sep 4, 2020, 2:01 PM IST

Updated : Sep 4, 2020, 2:44 PM IST

'అసెంబ్లీకి వచ్చే అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు'

ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని సభావ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సీఎస్​ సహా.. ఉన్నతాధికారులతో భేటీకి మంత్రి హాజరయ్యారు.

కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సీఎస్​ నేతృత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నామని వివరించారు. పార్లమెంట్ మార్గదర్శకాలు పాటిస్తూ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీ-మండలి హాల్‌లో ఆరడుగుల దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేశామన్నారు. శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

అసెంబ్లీకి వచ్చే అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పీపీఈ కిట్లు, ర్యాపిడ్ కిట్లు, ఆక్సీమీటర్లు. అసెంబ్లీ, మండలిలో రెండు చొప్పున అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచుతామన్నారు. మార్షల్స్‌ సహా సిబ్బంది రెండ్రోజుల ముందే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అసెంబ్లీ కార్యదర్శి ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు.

ఇది చూడండి ధోనీ 'పబ్​జీ' ఆపేసి ఆ గేమ్​ ఆడుతున్నాడట!

Last Updated : Sep 4, 2020, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.