ETV Bharat / state

Swagruha Plots Sale: బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధం - Prashanth Reddy Review On Swagruha Plots Sale

Swagruha Plots Sale: హైదరాబాద్ పరిధి బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్లు యధాస్థితిలో అమ్మకానికి సిద్ధం చేసినట్లు... మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. స్వగృహ ఫ్లాట్ల విక్రయంపై... సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు

Plots
Plots
author img

By

Published : May 5, 2022, 5:52 AM IST

Swagruha Plots Sale: స్వగృహ ఫ్లాట్ల విక్రయంపై గృహనిర్మాణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గంపగుత్తగా బ్లాకుల వారీగా అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు ఫ్లాట్లను విడిగా అమ్మాలని నిర్ణయించింది. సాధారణ పౌరులు, ఉద్యోగులు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. బండ్లగూడ, పోచారంలలో ఉన్న స్వగృహ ఫ్లాట్ల విక్రయంపై విధివిధానాల రూపకల్పనకు అధికారులతో ఆయన బుధవారమిక్కడ చర్చించారు. ఫ్లాట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. దరఖాస్తు రుసుంను రూ.1,000 (తిరిగివ్వని/నాన్‌ రిఫండబుల్‌)గా నిర్ణయించారు.

ప్రత్యేక యాప్‌: ‘సాధారణ పౌరులు, ఉద్యోగస్తులు.. ఆసక్తి కలిగినవారు మీ-సేవా ద్వారా, ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేక యాప్‌ అందుబాటులోకి వస్తుంది. అర్హులకు బ్యాంక్‌ లోన్‌ సౌకర్యం ఉంది. పేపర్‌ నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి 30 రోజుల వరకు www.swagruha.telangana.gov.in సైట్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి’ అని మంత్రి వేముల అధికారులకు సూచించారు.

మోడల్‌ హౌస్‌లు: కొనుగోలుదారుల కోసం బండ్లగూడ, పోచారంలో 6 చొప్పున మోడల్‌ హౌస్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ఆసక్తి కలిగినవారు అక్కడికక్కడే అప్లికేషన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సునీల్‌ శర్మ, స్వగృహ కార్పొరేషన్‌ సీఈ ఈశ్వరయ్య, ఈఈ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

ప్రతిపాదిత ఫ్లాట్ల విక్రయ ధరలు

బండ్లగూడలో ఉన్న ఫ్లాట్లు - 1,501
* పనులు పూర్తి అయినవి - 419. వీటికి చ.అ.ధర - రూ.3 వేలు
* పనులు మిగిలి ఉన్న ఫ్లాట్లు - 1,082. వీటికి చ.అ.ధర రూ. 2,750
పోచారంలో ఉన్న ఫ్లాట్లు - 1,470
* పనులు పూర్తి అయినవి - 1,328. వీటికి చ.అ.ధర రూ.2,500
* కొంచెం పనులు మిగిలి ఉన్న ఫ్లాట్లు - 142. వీటికి చ.అ.ధర రూ.2,250
* బండ్లగూడలో 3 బీహెచ్‌కే డీలక్స్‌ 345, 3 బీహెచ్‌కే 444, 2 బీహెచ్‌కే 712 ఫ్లాట్లు ఉన్నాయి.
* పోచారంలో 3 బీహెచ్‌కే డీలక్స్‌ 91, 3 బీహెచ్‌కే 53, 2 బీహెచ్‌కే 884, 1 బీహెచ్‌కే 442 ఫ్లాట్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి.

ఇవీ చూడండి: సొంత స్థలంలో డబుల్​ బెడ్రూం ఇళ్ల నిర్మాణం హామీపై సర్కారు కసరత్తు..

'తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.