ETV Bharat / state

PRASHANTH REDDY: 'అద్భుత కట్టడంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్' - telangana latest news

పారిస్​లో ఈఫిల్ టవర్, దుబాయ్​లో బూర్జు ఖలీఫా తరహాలో హైదరాబాద్​కు కమాండ్ కంట్రోల్ సెంటర్ మణిహారంగా ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ గొప్ప అద్భుత కట్టడంగా నిలుస్తుందని తెలిపారు. ఈ మేరకు పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.

'అద్భుత కట్టడంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్'

author img

By

Published : Jul 22, 2021, 5:31 AM IST

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం రెండు నెలల్లోగా పూర్తి కావాలని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ఆర్ అండ్ బీ అధికారులు, నిపుణులతో సమావేశమైన మంత్రి.. పనుల పురోగతిపై సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గొప్ప అద్భుత కట్టడంగా నిలుస్తుందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.

పారిస్​లో ఈఫిల్ టవర్, దుబాయ్​లో బూర్జు ఖలీఫా తరహాలో హైదరాబాద్​కు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుందని ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ 14వ అంతస్తు నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించవచ్చని తెలిపారు. నగరం నలువైపులా ఉన్న ముఖ్య ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ కోట, కేబీఆర్ పార్క్, హుస్సేన్ సాగర్ చూపరులకు ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా కన్పిస్తాయని అన్నారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్​లో మ్యూజియం..

రానున్న రోజుల్లో ఏడాది పొడవునా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్​లో మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు, తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే వివరాలు, తెలంగాణ విజయాలు, పోలీసు శాఖ, కమాండ్ కంట్రోల్ సెంటర్ వివరాలను అందులో పొందుపర్చనున్నట్లు వివరించారు. ప్రముఖ నిపుణులు వసీంఖాన్, వారి భాగస్వాముల ఆధ్వర్యంలో మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.

వేగంగా సేవలు అందించేందుకు..

రాష్ట్ర ప్రజలకు మరింత భద్రత, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా సేవలు అందించే దిశగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుపుతున్నారు. రాష్ట్ర ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయంగా సుమారు రూ.200 కోట్లతో సీసీసీ రూపుదిద్దుకుంటుంది. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో ఏడెకెరాల సువిశాల స్థలంలో సుమారు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో మొత్తం ఏబీసీడి అను నాలుగు టవర్లను నిర్మిస్తున్నారు.

ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్​ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల సీసీసీలతో అనుసంధానం చేస్తారు. విపత్తులు సంభవించినప్పుడు, దసరా, వినాయక నిమజ్జనం, రంజాన్ తదితర పండుగల సందర్భాల్లో బందోబస్తు, రక్షణకు సంబంధించిన అంశాలపై పర్యవేక్షించే వీలుంటుంది. అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే హెలిప్యాడ్ అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి అధికారులు నేరుగా సంఘటనా స్థలానికి చేరుకునే సౌలభ్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: CM KCR: 'ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజల అవసరాలను తీరుస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.