గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఎర్రగడ్డ లోని సుల్తాన్ నగర్, యాదగిరి నగర్లో బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రోగుల కోసం ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి దవాఖానా సిబ్బందితో మంత్రి చర్చించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఎమ్మెల్యే గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్ధిన్, వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని వారికి జరిమానా
సుల్తాన్నగర్లో బస్తీ దవాఖానా ప్రారంభం సందర్భంగా... అనుమతి లేకుండా ఆస్పత్రి పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహిన్ బేగంకు 20,000 రూపాయలు జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఎర్రగడ్డ కార్పొరేటర్ భర్త షరీఫ్ మాస్కు లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు వెయ్యి రూపాయల జరిమానా విధించాలని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక