దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ పప్పుదినుసుల ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్నేళ్లుగా పంటమార్పిడిలో భాగంగా పప్పుదినుసుల సాగును ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. 'పప్పు దినుసుల సాగులో అవకాశాలు, భవిష్యత్' అనే అంశంపై ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తయారు చేసిన నివేదికను హాకా భవన్లో విడుదల చేశారు.
కంది పంటను గతంలో 6 లక్షల ఎకరాల నుంచి గతేడాది 10.80 లక్షల ఎకరాలకు పెంచామని తెలిపారు. ఈ ఏడాది 20 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లలో దాల్ మిల్లుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తామని వెల్లడించారు. ఈ నివేదక ద్వారా పప్పుదినుసుల ఉత్పత్తి, ఉత్పాదకతకు ఫెడరేషన్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: KALESHWARAM PROJECT: కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 1.5 టీఎంసీల ఎత్తిపోతలు