రాష్ట్రంలో రుణమాఫీ అమలులో భాగంగా ఇవాళ తొలిరోజు 1,309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 25 వేల నుంచి 25,100 రూపాయల వరకు వ్యవసాయ రుణాలు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలకు ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 3,27,91,000 రూపాయలను 186 ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా... 50 వేల రూపాయలలోపు రైతుల పంట రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు.
రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీ మాదిరిగానే రుణమాఫీ నిధులూ జమ అవుతాయని తెలిపారు. రైతుల ఖాతాల్లో జమైన నిధులు బ్యాంకర్లు ఇతర పద్దుల కింద తీసుకోవద్దని సూచించారు. వ్యవసాయ పంట రుణాలు మాఫీ అయిన రైతులకు తక్షణమే.. బ్యాంకులు కొత్త రుణాలు అందజేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి: Loan Waiver : రాష్ట్రంలో నేటి నుంచి రెండో దఫా రుణమాఫీ