రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వాణిజ్య పత్తి పంట సాగు చేయాలని ప్రభుత్వం నిర్థేశించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో వానాకాలం సాగు పురోగతిపై మంత్రి సమీక్షించారు. ఈ ఏడాది వర్షాల ఆలస్యం కావడం సహా.. విత్తనాలు, రసాయన ఎరువులు, ఇతర ఉపకరణాల లభ్యతలపై విస్తృతంగా చర్చించారు.
15 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేయాలని లక్ష్యం పెట్టుకున్న దృష్ట్యా... రైతుల సౌకర్యార్థం విత్తనాలు, రసాయన ఎరువులు అందుబాటులో పెట్టామని ప్రకటించారు. రైతులు విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దన్న మంత్రి... ఆధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. తప్పనిసరిగా రశీదు తీసుకోవడంతోపాటు విత్తిన విత్తనాల ఖాళీ ప్యాకెట్లు భద్రపరచుకోవడం వల్ల నాణ్యత లోపిస్తే తదుపరి చర్యలు తీసుకునేందుకు అవి తోడ్పడుతాయని చెప్పారు.
ఇవీ చదవండి: