ETV Bharat / state

విత్తన సబ్సిడీ, యాంత్రీకరణలపై దృష్టి సారించాలి: నిరంజన్​రెడ్డి - telangana varthalu

మిద్దెతోటల పెంపకంపై నగరవాసులకు ఉద్యానశాఖ అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి అన్నారు. మన కూరగాయలు’ పథకం, రైతుబజార్ల నిర్వహణపై బోయిన్ పల్లి మార్కెట్​లో మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూరగాయల సాగు కోసం రైతుకు మరింత ప్రోత్సాహంతో పాటు విత్తన సబ్సిడీ, యాంత్రీకరణలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

విత్తన సబ్సిడీ, యాంత్రీకరణలపై దృష్టి సారించాలి: నిరంజన్​రెడ్డి

author img

By

Published : Feb 3, 2021, 9:54 PM IST

కూరగాయల సాగు కోసం రైతుకు మరింత ప్రోత్సాహంతో పాటు విత్తన సబ్సిడీ, యాంత్రీకరణలపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర అవసరాలకు అనుగుణంగా సమీప జిల్లాల రైతులను ప్రణాళికాబద్ధంగా ప్రోత్సహించాలన్నారు. 'మన కూరగాయలు’ పథకం, రైతుబజార్ల నిర్వహణపై బోయిన్ పల్లి మార్కెట్​లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మిద్దెతోటల పెంపకంపై నగర వాసులకు ఉద్యానశాఖ అవగాహన కల్పించాలన్నారు. అవగాహన ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. దళారి వ్యవస్థను తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం 'మన కూరగాయలు' పథకం ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఇతర పనిముట్లు లభించే విధంగా రైతుబజార్​లో అందుబాటులో ఉంచే అవకాశాలను అధికారులు పరిశీలించాలన్నారు.

రైతుబజార్లలో కూరగాయల ధర నిర్ణయించేటప్పుడు పంట రకం, నాణ్యతను పరిగణనలోకి తీసుకునే దిశగా ఆలోచించాలని మంత్రి తెలిపారు. నగర సమీపంలో కూరగాయలు పండించే రైతులను రైతుబజార్లకు అనుసంధానం మరింత పెరగాలని... కూరగాయలు తెచ్చే ఆర్టీసీ బస్సులను పునరుద్ధరణకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మార్కెటింగ్ అదనపు డైరెక్టర్ రవికుమార్, వివిధ జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పదో తరగతిలో 6 పరీక్షలే.. ప్రభుత్వం ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.