ETV Bharat / state

ఎక్కడా ఎరువుల కొరతని వినిపించకూడదు : నిరంజన్​ రెడ్డి - ఎరువులపై మంత్రి నిరంజన్​ రెడ్డి సమీక్ష

వర్షాలు కురుస్తున్నందున రైతులకు యూరియా, ఇతర ఎరువుల అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అధికారులను సూచించారు. ఎక్కడా కొరత అన్న మాట వినిపించొద్దని ఆదేశించారు. అలాగే కొవిడ్​ సోకకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని సూచించారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఎక్కడా ఎరువుల కొరత అని వినిపించకూడదు: మంత్రి నిరంజన్​ రెడ్డి

author img

By

Published : Jul 18, 2020, 6:30 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉద్యోగులు విధులకు హాజరు కావాలని.. అలాగే వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. తాజా ఖరీఫ్ సీజన్​కు సంబంధించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో రసాయన ఎరువులు, రైతు వేదికల నిర్మాణంపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు విజయ్‌కుమార్‌, సంయుక్త సంచాలకులు విజయగౌరి, బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా నేపథ్యంలో భవనాలను పరిశీలించిన మంత్రి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గనిర్దేశం చేశారు. వర్షాలు కురుస్తున్నందున రైతుల నుంచి యూరియా, కాప్లెక్స్, ఇతర ఎరువులకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా.. ఎరువులు అందుబాటులో ఉంచాలని.. ఎక్కడా కొరత అన్న మాట వినిపించొద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా, ఎరువుల కోటా ఎప్పటికప్పుడు డ్రా చేయాలని సూచించారు. రాష్ట్రంలో రేక్ పాయింట్ల నుంచి మండలాల వారీగా ఎంపిక చేసిన స్టాక్ పాయింట్లకు ఎరువులు తరలించి సిద్దంగా ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలిస్తూ మానిటరింగ్ చేయాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా 2601 రైతు వేదికల నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినందున.. ఇప్పటి వరకు 2588 రైతు వేదికల భూసేకరణ పూర్తైందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నిర్మాణాలను ఆయా మండలాల ఏఓలు, ఆయా క్లస్టర్ల ఏఈఓలు నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశించాలని... రైతు వేదికలు దసరాకు సిద్ధం కావాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైతాంగాన్ని సంఘటితం చేసి వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతువేదికలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

జనాభాలో 60 శాతం ఉన్న రైతులు ఒక్కతాటిపైకొచ్చి వ్యవసాయం లాభాల బాటపడితే ఇతర వర్గాలు సంతోషంగా ఉంటాయని... రైతువేదికల నిర్మాణం పూర్తైతే తెలంగాణ వ్యవసాయంలో నూతన విప్లవం మొదలవుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో యావత్ దేశానికి తెలంగాణ రైతాంగం దిక్సూచిలా నిలుస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: 35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.