ETV Bharat / state

కొహెడ బాధితులను అన్నివిధాలా ఆదుకుంటాం: మంత్రి నిరంజన్‌రెడ్డి - Koheda Market Minister Niranjan Reddy

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ కొహెడ పండ్ల మార్కెట్​లో ఈదురు గాలులు, వర్ష బీభత్సంపై మంత్రి నిరంజన్​ రెడ్డి స్పందించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మంత్రి నిరంజన్​ రెడ్డి
మంత్రి నిరంజన్​ రెడ్డి
author img

By

Published : May 4, 2020, 9:10 PM IST

Updated : May 4, 2020, 9:16 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ కొహెడ మార్కెట్​ ఘటనలో గాయపడిన వారి వైద్య చికిత్సల ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కొహెడ మార్కెట్​లో ఈదురు గాలులు, వర్ష బీభత్సంపై మంత్రి స్పందించారు. మార్కెట్‌లో షెడ్‌ కూలిపోవడం, మరో షెడ్ రేకులు ఎగిరిపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

ప్రాథమిక సమాచారాన్ని బట్టి ప్రమాదంలో 26 మంది గాయడినట్లు తెలుస్తోందన్నారు. బాధితుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాద సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విపరీతమైన సుడిగాలి వల్ల ఈ ప్రమాదం సంభవించిందని... అందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నట్లు నిరంజన్​ రెడ్డి చెప్పారు.

ఇవీ చూడండి : కొహెడ మార్కెట్‌లో ఈదురుగాలుల బీభత్సం

Last Updated : May 4, 2020, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.