ETV Bharat / state

ఆ ఇద్దరు నాయకులు ఎవరి ఉచ్చులో చిక్కుకొని ఉన్నారో అందరికీ తెలుసు: నిరంజన్‌రెడ్డి - నిరంజన్​రెడ్డి వార్తలు

Niranjan Reddy on suspension of Jupalli and Ponguleti: గత కొంతకాలంగా జూపల్లి, పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈరోజు వారిద్దరినీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి మంత్రి నిరంజన్​రెడ్డి స్పందించారు. జూపల్లి, పొంగులేటి పార్టీ అధినేతను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. ఇద్దరు నాయకుల ప్రవర్తనను బీఆర్ఎస్ పార్టీ సహనంగా పరిశీలించిందని తెలిపారు.

Niranjan Reddy on suspension of Jupalli and Ponguleti

author img

By

Published : Apr 10, 2023, 2:20 PM IST

పదవులు అనుభవించిన తర్వాత విమర్శలు చేయడం తగదు: నిరంజన్‌రెడ్డి

Niranjan Reddy on suspension of Jupalli and Ponguleti: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి బీఆర్​ఎస్ పార్టీ సస్పెన్షన్​ వేటు వేసింది. గత కొంతకాలంగా జూపల్లి, పొంగులేటి బీఆర్​ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ అధినేత కేసీఆర్​ వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై తాజాగా మంత్రి నిరంజన్​రెడ్డి స్పందించారు. పార్టీ అధినేతను పొంగులేటి, జూపల్లి విమర్శించడం సరికాదని మండిపడ్డారు. పార్టీకి అతీతులమనే వ్యక్తిగత ధోరణిని ఎవరూ సహించరని మంత్రి ధ్వజమెత్తారు. ఇద్దరు నాయకుల ప్రవర్తనను బీఆర్​ఎస్ పార్టీ సహనంగా పరిశీలించిందని చెప్పారు. చాలా కాలం పార్టీ సంయమనంతో వ్యవహరించిందని పేర్కొన్నారు.

పొంగులేటి, జూపల్లి ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ వదలకుండానే చూస్తోందని మంత్రి వివరించారు. పదవులు అనుభవించిన తర్వాత పదవులు ఇచ్చిన వారిపై విమర్శలు చేయడం తగదన్నారు. ఇద్దరు నాయకులు అసహనం వెళ్లగక్కుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపారని దుయ్యబట్టారు.

పార్టీ అధినేతను బలహీనపరిచే యత్నాలు ఫలించవు..: కొంతకాలం వేచి చూడాలని పలుమార్లు సీఎం కేసీఆర్ చెప్పారని తెలిపారు. రాజకీయ అవకాశం రాలేదని పార్టీపైనే దుమ్మెత్తి పోస్తున్నారని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పార్టీలు చెప్పేదే వారు చెబుతున్నారన్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు నాయకులు ఎవరి ఉచ్చులో చిక్కుకొని ఉన్నారో అందరికీ తెలుసని స్పష్టం చేశారు. పార్టీ అధినేతను బలహీనపరిచే యత్నాలు ఫలించవని తెలిపారు.

పార్టీ అధినేతను పొంగులేటి, జూపల్లి విమర్శించడం సరికాదు. పార్టీకి అతీతులమనే వ్యక్తిగత ధోరణిని ఎవరూ సహించరు. ఇద్దరు నాయకుల ప్రవర్తనను పార్టీ సహనంగా పరిశీలించింది. చాలా కాలం పార్టీ సంయమనంతో వ్యవహరించింది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ వదలకుండానే పార్టీ చూస్తుంది. పదవులు అనుభవించిన తర్వాత విమర్శలు చేయడం తగదు. ఇద్దరు నాయకులు అసహనం వెళ్లగక్కుతూ నిందలు మోపారు.- నిరంజన్​రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

ఇవీ చదవండి:

మసీదులు తవ్వుదాం.. పేపర్లు లీక్ చేద్దాం అనేటోళ్లకు ఓటేయకండి: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.