ETV Bharat / state

Rythu bandhu Scheme: రైతులకు తీపి కబురు.. రేపట్నుంచే రైతుబంధు నిధుల పంపిణీ - ts news

Rythu bandhu Scheme: రేపట్నుంచి ఈ ఏడాది యాసంగి సీజన్​కు సంబంధించిన రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం నిధులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఎకరా నుంచి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణ క్రమంలో నిధులు జమ చేస్తామని తెలిపారు.

Rythu bandhu Scheme: రైతులకు తీపి కబురు.. రేపట్నుంచే రైతుబంధు నిధుల పంపిణీ

author img

By

Published : Dec 27, 2021, 7:26 PM IST

Rythu bandhu Scheme : రాష్ట్రంలో రేపట్నుంచి ఈ ఏడాది యాసంగి సీజన్​కు సంబంధించి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం నిధులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో 43,036.63 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని తెలిపారు. ఈ సీజన్‌తో కలుపుకుని మొత్తం 50 వేల కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తవుతోందని చెప్పారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 10 నాటికి ధరణి పోర్టల్‌లో పట్టాదారులు, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులు, అర్హులు రైతుబంధు పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని ప్రకటించారు.

ఈ సీజన్​లో రూ.7645.66 కోట్లు

Minister Niranjan reddy on Rythu bandhu: ఈ యాసంగి సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులుకు గానూ 152.91 లక్షల ఎకరాలకు 7645.66 కోట్ల రూపాయలు జమ చేయడానికి సన్నద్ధమైనట్లు స్పష్టం చేశారు. దీనిలో 3.05 లక్షల ఎకరాలకు గానూ 94 వేల మంది రైతులు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాదారులు, ఎకరా నుంచి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణ క్రమంలో నిధులు జమ చేస్తామని తెలిపారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాలలో ఒకటిగా 2018 నవంబరులో రోమ్‌ నగరంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఏఎఫ్‌ఏఓ సైతం ప్రశంసించిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.