పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారీతిన వెళ్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నీరు వెళ్లకముందే ఏం చేయాలో తమకు తెలుసని చెప్పారు. చట్టబద్ధంగా ఏకపక్ష ప్రాజెక్టును అడ్డుకునే నైపుణ్యం తమకుందన్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్, తెరాసను నిందించే విపక్షాల నేతల విమర్శలను తాము పట్టించుకోబోమని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ఈ నేతలెవరైనా నోరు విప్పారా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. జలదోపిడీకి కావడి పట్టి చరిత్రహీనులుగా మిగిలిపోయారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదీ చూడండి : వలస కూలీ దంపతులకు కరోనా పాజిటివ్!