ETV Bharat / state

కరోనా రోగులకు మల్లారెడ్డి ఆస్పత్రిలో ఉచిత చికిత్స - free treatment to corona patients in mallareddy hospital

కరోనా రోగులకు మల్లారెడ్డి ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్​ నియోజకవర్గంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్​ చెక్కులు అందించారు.

minister mallareddy distributed cheques to beneficiaries
కరోనా రోగులకు మల్లారెడ్డి ఆస్పత్రిలో ఉచిత చికిత్స
author img

By

Published : May 17, 2021, 4:09 PM IST

మేడ్చల్ జిల్లా శామీర్​పేట్ మండల కేంద్రంలో 48 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి కొనియాడారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా సాయం చేస్తూ... సీఎం కేసీఆర్ పెద్దన్నలాగా మారారని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు 204 మందికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరిగిందని వివరించారు.

మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, ఘట్ కేసర్, బోడుప్పల్​లలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. కరోనా బాధితులకు మల్లారెడ్డి ఆసుపత్రి, నాచారం ఈఎస్​ఐ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందజేస్తామన్నారు.

కరోనా సోకిన వారు మల్లారెడ్డి ఆసుపత్రికి కానీ, నాచారం ఈఎస్ఐ ఆసుపత్రికి వస్తే వారికి ఉచితంగా చికిత్స అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఫీవర్ సర్వేలో రోగులకు మందులు ఇచ్చారు. ఈ సందర్బంగా శామీర్​పేట్ మండలంలోని మజీద్​పూర్ గ్రామానికి చెందిన ఉషారాణి అనే మహిళ రోజూ 25 మంది కరోనా బాధితులకు బోజనం అందిస్తున్నారని తెలుసుకుని ఆమెను అభినందించారు.

ఇదీ చదవండి; రెండో విడతలోనూ గర్భిణులపై కొవిడ్‌ తీవ్ర ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.