మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయం పదిగంటలకు పది నిమిషాలు మీ కోసం కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మనవళ్లతో కలిసి బోయిన్పల్లిలోని స్వగృహంలో ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో నీరు నిలవకుండా చూసుకోవాలని సూచించారు. దోమలు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, మాస్కులు ధరించి దూరం పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం