ETV Bharat / state

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ

author img

By

Published : Dec 24, 2020, 6:54 PM IST

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మౌలికవసతుల కల్పనకు రూ.300కోట్లు ఇవ్వాలని కోరారు.

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ

రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని కోరారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు నిధులతోపాటు.. సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీకి కేటీఆర్ లేఖ రాశారు.

టెక్స్‌టైల్‌ పార్కులో మౌలిక వసతుల పనుల కోసం తక్షణమే 300కోట్ల రూపాయలు ఇవ్వాలని విన్నవించారు. సిరిసిల్లా మెగా పవర్‌ లూం క్లస్టర్‌ ప్రాజెక్టు వ్యయమైన 993.65కోట్లలో 49.84కోట్లు మంజూరు చేయాలని కోరారు. 756కోట్లతో పవర్‌ లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వివరించారు.

రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని కేటాయించాలని కోరారు. దీనికోసం పోచంపల్లిలో సరిపడా భూమి, భవనం సిద్ధంగా ఉన్నాయని లేఖలో వివరించారు. పవర్ లూంలను అప్ గ్రేడ్ చేయడంతోపాటు... బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 50 శాతం నూలు రాయితీని కేంద్రం పరిశీలించాలని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులపై రెండేళ్లపాటు జీఎస్టీని ఎత్తివేయాలని కోరారు. దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్‌ గణన చేపట్టి జియో ట్యాగింగ్ చేయాలని కేంద్రాన్ని కేటీఆర్‌ కోరారు.

ఇదీ చూడండి: క్రైస్తవులకు గవర్నర్​, సీఎం క్రిస్మస్​ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.