ETV Bharat / state

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయండి: కేటీఆర్ - telangana rains

Minister KTR review on heavy rains: ప్రగతి భవన్ నుంచి మంత్రి కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల దృష్ట్యా హైదరాబాద్, పలు పట్టణాల పరిస్థితులపై సమీక్షించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. ప్రాణనష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయండి: కేటీఆర్

author img

By

Published : Jul 27, 2022, 3:23 PM IST

Minister KTR review on heavy rains: భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్నిశాఖలు పనిచేయాలని పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ నుంచి అధికారులతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్​తో పాటు పలు పట్టణాల, పరిస్థితులపై సమీక్షించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలు వేగంగా ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ సూచించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై కూడా ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని మంత్రి చెప్పారు. పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలని తెలిపారు.

స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని పురపాలకశాఖ అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం, పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి కలిసి వరద నివారణ, తగ్గింపు చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్న ఆయన... రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీఎంఏ సత్యనారాయణను ఆదేశించారు.

పట్టణాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించాలని... చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని అన్నారు. వాటి పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వంటి అంశాలపై నీటిపారుదల శాఖతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని కేటీఆర్ అధికారులకు స్పష్టం చేశారు.వర్షాలు తగ్గుముఖం పట్టగానే అత్యవసరమైన రహదార్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.