పారిశుద్ధ్య నిర్వహణ తీరు గురించి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వారం రోజుల్లో ప్రణాళిక రూపొందించి పురపాలక శాఖకు ఇవ్వాలని కేటీఆర్ సూచించారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ మార్గదర్శకాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది, వాహనాలు ఉండాలన్నారు. పురపాలక సిబ్బందికి కూడా ప్రభుత్వమే బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని దృశ్యమాధ్యమ సమీక్షలో చెప్పారు. ఇంటింటి నుంచి తడి-పొడి చెత్త సేకరణపైన ప్రత్యేక దృష్టి చేపట్టాలని కేటీఆర్ కోరారు. జనాభా అవసరాల మేరకు పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని.. నగరాల్లో మరిన్ని షీ-టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీకి గ్రీన్ ప్లాన్ ఉండేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. మున్సిపాలిటీల్లో నర్సరీతో పాటు గ్రీన్ లాంగ్ స్పేస్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
ఇదీ చదవండిః హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతోంది: కేటీఆర్