KTR Tweet about twitter new CEO: ట్విటర్ సీఈవో నియమితులైన పరాగ్ అగర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. సిలికాన్ వ్యాలీలో ప్రముఖ సంస్థలకు భారతీయులే సీఈవోలన్న మంత్రి... మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎంకు భారతీయులే సీఈవోలగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. తాజాగా ట్విటర్‌కు భారతీయుడే సీఈవో కావడం గర్వకారణమని కొనియాడారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌కు కొత్త సీఈఓ (ముఖ్య కార్యనిర్వహణాధికారి)గా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ (45) నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆయన కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా ఉన్నారు.
-
What do MicroSoft, Google, Adobe, IBM, Micron, Master Card and now Twitter have in common?
— KTR (@KTRTRS) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
All are led by CEOs who grew up in India!
Congratulations to @paraga who’s been chosen as the CEO of Twitter
">What do MicroSoft, Google, Adobe, IBM, Micron, Master Card and now Twitter have in common?
— KTR (@KTRTRS) November 30, 2021
All are led by CEOs who grew up in India!
Congratulations to @paraga who’s been chosen as the CEO of TwitterWhat do MicroSoft, Google, Adobe, IBM, Micron, Master Card and now Twitter have in common?
— KTR (@KTRTRS) November 30, 2021
All are led by CEOs who grew up in India!
Congratulations to @paraga who’s been chosen as the CEO of Twitter
ఇదో గౌరవం..
ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్, స్టాన్‌ఫోర్డ్‌లో పీహెచ్‌డీ చదువుకున్నారు. తాజా నియామకంపై స్పందించిన ఆయన ‘ఈ పదవి చేపట్టడం గౌరవంగా భావిస్తా’నని పేర్కొన్నారు. డోర్సీకు కృతజ్ఞతలు చెప్పారు. 'మీ మార్గదర్శనం, స్నేహం కొనసాగుతుందని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరాగ్‌ను ఈ స్థానంలో నిలబెట్టడానికి మూడు కారణాలున్నాయని డోర్సీ అన్నారు.
"కొత్త సీఈఓ కోసం బోర్డు చాలా తీవ్రంగా వెతికింది. చివరకు పరాగ్‌ను ఏకగ్రీవంగా ఎంచుకుంది. అయితే కొంత కాలంగా నా ఎంపిక కూడా అతడే. ఎందుకంటే కంపెనీని, కంపెనీ అవసరాలను అతను లోతుగా అర్థం చేసుకున్నాడు. ప్రతి కీలక నిర్ణయం వెనక పరాగ్ ఉన్నారు. ఈ కంపెనీ ఇలా మారడానికి కారణమయ్యారు. అంతే కాదు.. ఆసక్తి, హేతుబద్ధత, సృజనాత్మకత, వినయం అన్నీ ఉన్నాయి. మనసు పెట్టి పనిచేస్తారు. మా సీఈఓగా నాకు అతనిపై పూర్తి విశ్వాసం ఉంది"
-డోర్సీ
"పదేళ్లు గడిచిపోయినా.. నాకు నిన్నటిలాగే ఉంది. ఎత్తుపల్లాలు, సవాళ్లు, గెలుపులు, ఓటములు.. అన్నీ చూశాను. అయితే అప్పటికి.. ఇప్పటికీ ట్విట్టర్ ప్రభావం అద్భుతంగా మారింది. మా ప్రగతి కొనసాగిస్తాం. మా ముందు గొప్ప అవకాశాలెన్నో ఉన్నాయి. మా లక్ష్యాలను చేరడానికి ఇటీవలే వ్యూహాలను మెరుగుపరచుకున్నాం. మా వినియోగదార్లకు, వాటాదార్లకు.. అందరికీ అత్యుత్తమ ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంటాం"
-పరాగ్ అగర్వాల్
డోర్సీ ఎందుకు వెళ్లారంటే..కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్న సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ తన నిష్క్రమణపై ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. 'పదహారేళ్ల పాటు కంపెనీలో సహ వ్యవస్థాపకుడి నుంచి సీఈఓగా, సీఈఓ నుంచి ఛైర్మన్.. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా; ఆ తర్వాత తాత్కాలిక సీఈఓ, సీఈఓగా.. ఇలా యాత్ర సాగింది. ఇపుడు బయటకెళ్లాలని నిర్ణయించుకున్నా..' అని అందులో పేర్కొన్నారు. 'వ్యవస్థాపక నాయకత్వంలోనే ఓ కంపెనీ ఉండాలంటూ చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ వాదనతో నేను ఏకీభవించను. సంస్థ వైఫల్యానికి అదీ ఓ కారణమవుతుందని విశ్వసిస్తా. కంపెనీ పునాదులు, వ్యవస్థాపకుల నుంచి కంపెనీ బయటకు రావడానికి చాలా కష్టపడ్డా' అని రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: Hussain Sagar Hyderabad News : కోట్లు ఖర్చు చేసినా.. ఏళ్లు గడుస్తున్నా.. మారని సాగర్ కథ