ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచన అద్భుత ఫలితాలను తీసుకొచ్చిందని పురపాలక, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్(MINISTER KTR) అన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని పేర్కొన్నారు. గ్రీన్ బడ్జెట్‌కు(GREEN BUDGET) పదిశాతం నిధులను కేటాయించడం మంచి ఫలితాలను ఇస్తోందని కేటీఆర్ ట్విట్టర్(KTR TWITTER)లో తెలిపాారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పల్లెప్రకృతి వనాల(NURSERIES PHOTOS) ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో 24 నుంచి 33 శాతానికి పచ్చదనాన్ని పెంచాలని... మొత్తం 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఆరు దఫాల్లో 220 కోట్ల 70 లక్షల మొక్కలు నాటారు. హరితహారం కోసం ఇప్పటి వరకు అన్ని శాఖలు కలిపి రూ.5,591 కోట్లు ఖర్చు చేశారు. హరితహారం(HARITHA HARAM) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన చర్యల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 20 వేల ఎకరాల మేర పచ్చదనం విస్తీర్ణం, 3.67 శాతం పచ్చదనం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2021-22లో 19.86 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలకు నిర్దేశించింది.
-
Some more pics of the village parks pic.twitter.com/1UJM19j0z2
— KTR (@KTRTRS) July 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Some more pics of the village parks pic.twitter.com/1UJM19j0z2
— KTR (@KTRTRS) July 8, 2021Some more pics of the village parks pic.twitter.com/1UJM19j0z2
— KTR (@KTRTRS) July 8, 2021
ఇదీ చూడండి: PRAGATHI: రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పల్లె,పట్టణప్రగతి, హరితహారం