KTR Tweet Today: సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ మంత్రి ట్వీట్ చేశారు. అదనపు ఎక్సైజ్ ఛార్జీలు, సెస్‌లతో.. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆక్షేపించారు. ఆ కారణం వల్ల నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం.. అన్నీ పిరం... జగమంతా గరం గరం.. అంటూ ట్విటర్లో మంత్రి పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ ఛార్జీలు, సెస్‌లు తొలగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
-
ఉప్పు పిరం.. పప్పు పిరం..
— KTR (@KTRBRS) April 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరం
అన్నీ పిరం.. పిరం...
జనమంతా గరం... గరం...
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని... మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ.."
Modi Ji, we demand scrapping of Additional Excise Duties and… pic.twitter.com/BAzDtlDHPf
">ఉప్పు పిరం.. పప్పు పిరం..
— KTR (@KTRBRS) April 5, 2023
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరం
అన్నీ పిరం.. పిరం...
జనమంతా గరం... గరం...
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని... మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ.."
Modi Ji, we demand scrapping of Additional Excise Duties and… pic.twitter.com/BAzDtlDHPfఉప్పు పిరం.. పప్పు పిరం..
— KTR (@KTRBRS) April 5, 2023
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరం
అన్నీ పిరం.. పిరం...
జనమంతా గరం... గరం...
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని... మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ.."
Modi Ji, we demand scrapping of Additional Excise Duties and… pic.twitter.com/BAzDtlDHPf
మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం: మరోవైపు మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. మే 11, 12 తేదీల్లో లండన్‌లో జరగనున్న ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సు రెండవ ఎడిషన్‌కు.. గ్లోబల్ అడ్వైజరీ సంస్థ ఈపీజీలో పాల్గొనాలని.. కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఏర్పాటు చేయనున్న విందుకు సైతం ఆయన ఆహ్వానం అందుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్ అంతటా జరగనున్న భారత వారోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో.. బహుళ వ్యాపార, మీడియా, రాజకీయ నాయకులతో సహా 800 మందికి పైగా ప్రజలు హాజరుకానున్నారు.
భారతీయ జనతా పార్టీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ తరహా: గతంలోనూ మంత్రి కేటీఆర్ నకిలీ ధ్రువపత్రాలపై చర్చకు తెరలేపారు. బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ తరహాలో చాలా మంది ఉన్నట్లున్నారని ఆయన ట్విటర్ వేదికగా విమర్శించారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలపై నకిలీ ధ్రువపత్రాల ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. వారి ఇద్దరి దగ్గర రాజస్థాన్, తమిళనాడు విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని అంటున్నారని తెలిపారు. ఎంపీగా ఎన్నికైన అఫిడవిట్లో అబద్ధాలు చెప్పడం నేరం కాదా అని ప్రశ్నించారు. లోక్‌సభ సభాపతి వాటిని పరిశీలించి తప్పు అని రుజువైతే వారికి అనర్హత వేటు వేస్తారా అని కేటీఆర్ ట్విటర్ వేదికగా నిలదీశారు.
ఇవీ చదవండి:
- బండి సంజయ్ అరెస్టు అందుకేనట.. కారణం చెప్పిన మంత్రులు
- బండి సంజయ్ అరెస్ట్.. రేపు హైకోర్టులో విచారణ
- కేసీఆర్‌కు వీడ్కోలు విందు ఇచ్చే సమయం దగ్గరకు వచ్చింది: తరుణ్‌చుగ్
- కేంద్ర సంస్థల 'దుర్వినియోగం'పై విచారణకు నో- పిటిషన్ ఉపసంహరించుకున్న విపక్షాలు
- గుడిలో ముస్లిం దివ్యాంగురాలి పాఠాలు.. ఎర్రకోట సాక్షిగా పేద పిల్లలకు కానిస్టేబుల్ విద్యాదానం
- బెంగళూరు వాసికి జాక్‌పాట్.. లాటరీలో రూ.44 కోట్లు.. ప్రాంక్ అనుకొని నంబర్ బ్లాక్..