KTR vs Bandi Sanjay Tweet War: ప్రధాని నరేంద్ర మోదీ ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణే లేదని మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని మాత్రం ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, మెట్రో రెండో దశ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, గిరిజన విశ్వవిద్యాలయం, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని మంత్రి ట్వీట్లో పేర్కొన్నారు.
Minister KTR fires on PM Modi: తెలంగాణకు ఏదీ ఇచ్చేది లేదని మోదీ సర్కార్ చెప్పిందన్నారు. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ ఎందుకుండాలని కేటీఆర్ ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదన్న ఆయన.. అందుకు రాష్ట్రానికి చెందిన నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. 9 ఏళ్లుగా అడుగుతుంటే.. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ, ప్రధాని రాష్ట్రం గుజరాత్‌కు లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి 20 వేల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు.
-
తెలంగాణకు...
— KTR (@KTRBRS) March 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం - ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం - ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం - ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం - ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం - ప్రధాని
ప్రధాని…
">తెలంగాణకు...
— KTR (@KTRBRS) March 30, 2023
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం - ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం - ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం - ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం - ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం - ప్రధాని
ప్రధాని…తెలంగాణకు...
— KTR (@KTRBRS) March 30, 2023
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం - ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం - ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం - ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం - ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం - ప్రధాని
ప్రధాని…
బండి vs కేటీఆర్ ట్వీట్ వార్: గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితం ఇదని కేటీఆర్ ఆక్షేపించారు. మంత్రి కేటీఆర్, బండి సంజయ్‌ల మధ్య ట్వీట్ల వార్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేటీఆర్ చేసిన ట్వీట్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై బండి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు, నిన్ను ఎందుకు భరించాలి.. సహించాలని మండిపడ్డారు. అసలు కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే, ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదని ప్రశ్నించారు.
-
ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం - కేసీఆర్
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
దళితులకు మూడెకరాలు ఇవ్వం - కేసీఆర్
దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం - కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం - కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం - కేసీఆర్
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం - కేసీఆర్
దళితబంధు అర్హులకు ఇవ్వం - కేసీఆర్
పంచాయతీ,…
">ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం - కేసీఆర్
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2023
దళితులకు మూడెకరాలు ఇవ్వం - కేసీఆర్
దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం - కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం - కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం - కేసీఆర్
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం - కేసీఆర్
దళితబంధు అర్హులకు ఇవ్వం - కేసీఆర్
పంచాయతీ,…ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం - కేసీఆర్
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2023
దళితులకు మూడెకరాలు ఇవ్వం - కేసీఆర్
దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం - కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం - కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం - కేసీఆర్
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం - కేసీఆర్
దళితబంధు అర్హులకు ఇవ్వం - కేసీఆర్
పంచాయతీ,…
కేంద్రం వారికి అనుకూల నగరాలకు ప్రాజెక్టులు ఇస్తోంది: తాజాగా.. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ సాధ్యం కాదనడం సరికాదని మంత్రి కేటీఆర్ కేంద్రం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గతంలో ఈ మేరకు మంత్రి.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్రం వారికి అనుకూల నగరాలకు మెట్రో రైల్ ప్రాజెక్టులు ఇస్తోందని పేర్కొన్నారు. మోదీ సర్కార్ రద్దీ తక్కువగా ఉన్న నగరాలకు అయితే మెట్రో రైల్ మంజూరు చేస్తోందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌కి మెట్రో రైల్ విస్తరణ ఆర్హత లేదనడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
చిన్న పట్టణాలకు కేంద్ర మెట్లో ప్రాజెక్టులను కేటాయించింది: దేశంలోనే అతి తక్కువ కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరం హైదరాబాద్ అని, ఇక్కడ ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందన్న వాదన అర్థరహితమని మంత్రి కేటీఆర్ చెప్పారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్రాజ్, మీరట్ వంటి చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అర్హత లేని పట్టణాలు, రాష్ట్రాలకు ప్రాజెక్టులను కట్టబెడుతూ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కేంద్రం పదే పదే అన్యాయం చేస్తోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం పట్ల మోదీ సర్కార్ పక్షపాత దృక్పథంతో ఆలోచిస్తుందన్నారు.
ఇవీ చదవండి: