ETV Bharat / state

విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు: కేటీఆర్‌

minister
విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు: కేటీఆర్‌
author img

By

Published : Mar 10, 2021, 1:29 PM IST

Updated : Mar 10, 2021, 9:20 PM IST

13:25 March 10

'అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతాం'

విశాఖ ఉక్కు ఉద్యమానికి కేటీఆర్‌ మద్దతు

విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఏపీకి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. అవసరమైతే విశాఖ వెళ్లి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. ఏపీ వాళ్లు కూడా తెలంగాణకు మద్దతుగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మోదీ ప్రైవేట్‌పరం చేసేలా ఉన్నారని విమర్శించారు. 

‘‘బయ్యారంలో సెయిల్‌ ద్వారా ఉక్కు కర్మాగారం పెడతాం, వేలాది మందికి  ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కానీ, విశాఖలో పోరాడి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని వంద శాతం అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో వేలాది మంది ఉక్కు ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఉద్యోగులందరికీ అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్‌ ఆనుమతితో వైజాగ్‌ వెళ్లి ప్రత్యక్షంగా వారి పోరాటానికి మద్దతు తెలియజేస్తాం. ఎక్కడో విశాఖలో జరిగే ఉద్యమం..  మనకెందుకులే అనుకుంటే రేపు మన దగ్గరకు వస్తారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్ముతున్నారు.. రేపు బీహెచ్‌ఈఎల్‌ అమ్ముతారు, ఎల్లుండి సింగరేణి అమ్ముతారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిని కూడా ప్రైవేటు పరం చేయండి అంటారు. ఏమైనా చేస్తారు. ఉక్కు ఉద్యమానికి  మద్దతిస్తాం.. తెలంగాణలో ప్రభుత్వ సంస్థలను అమ్మే ప్రయత్నం జరిగితే వారు కూడా మాతో కలిసిరావాలి’’ అని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్​ జలవిహార్‌లో రికగ్నైజెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోషియేషన్​తో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ఐఐఎం రాష్ట్రానికి అడిగితే కేంద్రం ఇప్పటికీ ఇవ్వలేదని కేటీఆర్ తెలిపారు. ఏది ఇవ్వని భాజపాకు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని రామచందర్‌రావు  ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.

Last Updated : Mar 10, 2021, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.