ETV Bharat / state

'తెరాసను దుర్భేద్యంగా మలిచేందుకు కృషి చేయాలి: కేటీఆర్

TRS District Presidents Met KTR : తెరాసను దుర్భేద్యంగా మలిచేందుకు జిల్లా అధ్యక్షులు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకుంటూ పని చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.

TRS District Presidents Met KTR, ktr with trs leaders
కేటీఆర్​ను కలిసిన జీవీ రామకృష్ణారావు
author img

By

Published : Jan 28, 2022, 5:53 PM IST

TRS District Presidents Met KTR: తెరాసను దుర్భేద్యంగా మలిచేందుకు జిల్లా అధ్యక్షులు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరినీ సమన్వయం చేసుకుంటూ సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలని సూచించారు. తెరాస శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటూ... వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

TRS District Presidents Met KTR, ktr with trs leaders
జిల్లా కొత్త అధ్యక్షులకు కేటీఆర్ దిశానిర్దేశం

కొత్తగా నియమితులైన జిల్లాల అధ్యక్షులు నిజామాబాద్- జీవన్ రెడ్డి, జగిత్యాల-విద్యాసాగర్ రావు, కామారెడ్డి-ఎం.కె.ముజీబుద్ధీన్, కరీంనగర్- జీవీ రామకృష్ణారావు తదితరులు మంత్రి కేటీఆర్​ను శుక్రవారం కలిశారు. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఎమ్మెల్సీ కవిత తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కొత్త అధ్యక్షులకు కేటీఆర్ శుభాకాంక్షలు

TRS District Presidents: తెలంగాణ రాష్ట్ర సమితికి 33 జిల్లాల అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం(జనవరి 26) ప్రకటించారు. 19 జిల్లాలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా నియమించారు. మూడు జిల్లాలకు ఎంపీలు, రెండు జిల్లాలకు ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు. మరో మూడు జిల్లాలకు జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఒక జిల్లాకు మాజీ ఎమ్మెల్యే, ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్‌ నేతలను నియమించారు. జిల్లా అధ్యక్షుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి అధ్యక్షులు వీరే.

మంత్రిని కలిసిన జిల్లాల కొత్త అధ్యక్షులు
TRS District Presidents Met KTR, ktr with trs leaders
కేటీఆర్​ను కలిసిన జీవీ రామకృష్ణారావు

TRS District Presidents Met CM KCR: రాష్ట్రంలో కొత్తగా నియమింపబడ్డ తెరాస జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఇటీవలె మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్​నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి, చింత ప్రభాకర్, జీవీ రామకృష్ణారావు, విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, మాగంటి గోపీనాథ్, శంభీపూర్ రాజు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుసుమ జగదీష్, సంపత్ రెడ్డి, గండ్ర జ్యోతి, సి.లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కోనేరు కోనప్ప తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ను కలిశారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అధ్యక్షులతో ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.