ETV Bharat / state

సీఐఐ స్టార్టప్స్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్​లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అంకురాలకు సంబంధించిన కేంద్రాన్ని మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. సీఐఐ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్​ప్రిన్యూయార్​షిప్ అండ్ స్టార్టప్స్​గా పిలిచే ఈ కేంద్రం... ‘ప్రపంచం కోసం తెలంగాణలో ఆలోచనలు, నవకల్పవనలు’ అనే ఇతివృత్తంతో పనిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.

CII Centre for Innovation, Entrepreneurship

author img

By

Published : Jul 12, 2020, 1:32 PM IST

భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అంకురాలకు సంబంధించిన కేంద్రాన్ని హైదరాబాద్​లో ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. సీఐఐ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్​ప్రిన్యూయార్​షిప్ అండ్ స్టార్టప్స్​గా పిలిచే ఈ కేంద్రం... ‘ప్రపంచం కోసం తెలంగాణలో ఆలోచనలు, నవకల్పవనలు’ అనే ఇతివృత్తంతో పనిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కేంద్రం అంకురాలు, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు సహయపడనుందన్నారు మంత్రి కేటీఆర్​. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే విధంగా 3 లక్షల మంది సభ్యులను, అంకురాలను ఈ కేంద్రం అనుసంధానిస్తుందని సీఐఐ నేషనల్ స్టార్టప్‌ కౌన్సిల్‌ జాతీయాధ్యక్షులు గోపాలకృష్ట తెలిపారు. మార్కెట్​కు ఉపయోగపడే విధంగా పరిశోధనను ప్రోత్సహిస్తుందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : 'కూలుతున్నది సచివాలయమే కాదు తెలంగాణ బతుకులు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.