ETV Bharat / state

ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ - ప్రపంచ టీకాల రాజధాని హైదరాబాద్

హైదరాబాద్​ వేదికగా బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌ మారిందని వెల్లడించారు.

Minister KTR said that Hyderabad has become the capital of global vaccines
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్
author img

By

Published : Feb 22, 2021, 12:38 PM IST

ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌ మారిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్‌ ఉండటం ఎంతో గర్వకారణమని వెల్లడించారు. హైదరాబాద్​ వేదికగా బయో ఆసియా సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్... భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ టీకా తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు.

దేశీయ టీకాను తెచ్చిన భారత్ బయోటెక్ కృషి గర్వకారణమని ప్రసంశించారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో విస్తరిస్తున్నాయని తెలిపారు. భాగ్యనగరం‌లో కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని వివరించారు. హైదరాబాద్‌లో ఫార్మా సెక్టార్ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జినోమ్ వ్యాలీలో బయోఫార్మా హబ్.. బి-హబ్ ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.