కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్లు హైదరాబాద్‌కు డజన్ మంది వస్తున్నారని... వరదల సమయంలో ఒక్కరు కూడా రాలేదని మండిపడ్డారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. అప్పుడు రాని వారు ఇప్పుడు వరదలా వస్తున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈసీఐఎల్ చౌరస్తాలో మంత్రి రోడ్‌షో నిర్వహించారు.
హైదరాబాద్‌కు వరదలు వస్తే సాయం చేయండి అని కేంద్రాన్ని అడిగితే ఉలుకుపలుకు లేదు. కర్ణాటక, గుజరాత్‌కు మాత్రం సాయం చేశారు. మన చెమట, రక్తం ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చే టూరిస్టులు ఏం ఇవ్వరు... ఏం ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వమే ఇస్తుంది.
--- రోడ్‌షోలో కేటీఆర్
ఎన్టీఆర్ సమాధి, పీవీ నర్సింహారావు సమాధిని పగులగొట్టమని ఒక పిచ్చోడు అంటాడు... మరొక పిచ్చోడు చలాన్లు కడుతామంటున్నాడు. ఇలాంటోళ్లకా మనం ఓట్లేసేది? భాజపా నేతలు నల్లధనం వెనక్కి తెస్తామన్నారు.. నల్ల చట్టాలు తెచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని కబుర్లు చెప్పారు. మేయర్ పీఠం ఎంఐఎంకు ఇస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు.
--- రోడ్‌షోలో కేటీఆర్
కేంద్రమంత్రులు నగరానికి వచ్చేటపుడు రూ. 1,350 కోట్లు తీసుకురావాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితిని లేదన్నారు. చలాన్లు కడతామన్న వ్యక్తే మోటారు వాహన చట్టానికి ఓటేశారని ఆ విషయం అయనకు కూడా తెలియదన్నారు.
ఇదీ చూడండి: అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్