ఉద్యోగాల పేరుతో దేశంలో యువతను వంచించిన కేంద్రంపై 132 కోట్ల ఛార్జిషీట్లు వేయాలని పురపాలక మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిర్ణయాత్మక ప్రభుత్వం కావాలో... విభజన రాజకీయాలు కావాలో హైదరాబాదీలు నిర్ణయించుకోవాలని మరోసారి కోరారు. ప్రశాంత భాగ్యనగరంలో చిచ్చుపెట్టాలని చూసేవారికి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
రాష్ట్రానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక్క రూపాయి తేలేదని విమర్శించారు. ఆరేళ్లలో రాష్ట్రం తరఫున కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.75 లక్షల కోట్లు ఇచ్చినా... రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్లో ఏ గల్లీకి వెళ్లినా... తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు.
వరద విపత్తు వేళ ప్రజలను ఆదుకునేందుకు పదివేల సాయం ఇస్తుంటే లేఖలు రాసి భాజపా నేతలే మోకాలడ్డారని ఆక్షేపించిన కేటీఆర్ ఆరున్నర లక్షల మందికి కేంద్రం నుంచి రూ.25 వేలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : రూ.25 వేలిస్తే మేమే చప్పట్లు కొడతాం: కేటీఆర్