ETV Bharat / state

KTR on Ponds: చెరువుల పరిరక్షణకు ప్రత్యేక కమిషనర్: కేటీఆర్

హైదరాబాద్​లో చెరువుల పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. చెరువుల అభివృద్ధికి చర్యలు చేపట్టేలా ప్రత్యేక కమిషనర్‌ను నియమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చెరువుల శుద్ధి, ఎఫ్‌టీఎల్ నిర్ధరణ, సుందరీకరణ బాధ్యతలు వారికి అప్పగించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

minister KTR review with ghmc officers
జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
author img

By

Published : Sep 13, 2021, 8:17 PM IST

జీహెచ్ఎంసీలో చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషనర్​ను నియమిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. చెరువుల అభివృద్ధి కార్యాచరణను ప్రత్యేక కమిషనర్‌కు అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్​ఎంసీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్​కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గత కొంత కాలంగా నగరంలోని చెరువుల సుందరీకరణ, అభివృద్ధి, పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతూ వస్తోందని మంత్రి అన్నారు.

చెరువుల శుద్ధి, ఎఫ్‌టీఎల్ నిర్ధరణ, సుందరీకరణ బాధ్యతలు ప్రత్యేక కమిషనర్​కు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ పరిధిలో 185 చెరువులు ఉన్నట్లు మంత్రి తెలిపారు. సివరేజ్ నిర్వహణ, ఎస్టీపీలు, నిర్మాణ కార్యక్రమాలు, శుద్ధి చేసిన నీటిని మళ్లించడం, సాగునీటి వనరుల పరిరక్షణ, చెరువు కట్టల బలోపేతం, వాటిపై గ్రీన్ కవర్ పెంచడం వంటి పలు బాధ్యతలను ప్రత్యేక కమిషనర్ నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ప్రత్యేక కమిషనర్ నేతృత్వంలో పని చేస్తుందని తెలిపారు.

మరింత వేగవంతంగా పనులు

చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా కమిషనర్​ను నియమించడంతో ఈ కార్యక్రమాలను మరింత వేగవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నగర పరిధిలోని చెరువులు, ఇతర జల వనరులను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన బాధ్యతలను కమిషనర్​కు అప్పగిస్తామని కేటీఆర్ తెలిపారు.

లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్

చెరువుల పరిరక్షణ కమిటీ ప్రత్యేక కమిషనర్ ఆధ్వర్యంలో పని చేస్తుందని.. సాగునీరు, రెవెన్యూ, పురపాలక, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇతర అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకుని పని చేయాల్సి ఉంటుందని కేటీఆర్ సూచించారు. భవిష్యత్తు తరాలకు సుందరమైన కాలుష్య రహిత జలవనరులను అందించాలన్న లక్ష్యంతోనే ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్రత్యేక కమిషనర్ వ్యవస్థ ద్వారా తమ ప్రయత్నం మరింత వేగవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఇప్పటిదాకా చేపట్టిన చెరువుల అభివృద్ధి, సుందరీకరణ, పరిరక్షణ కార్యక్రమాలపై మంత్రి ఆరా తీశారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు అత్యంత కీలకమైన నాలాల అభివృద్ధి, చర్యలపై వివరాలు మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. నాలాల అభివృద్ధికి సంబంధించి ఎస్​ఎన్​డీపీ కార్యక్రమం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సమీక్షించారు.

ఇదీ చూడండి: KTR: ఈ నెల 15 వరకు తెరాస గ్రామ కమిటీలు పూర్తి చేయాలి: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.