ETV Bharat / state

24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం - ktr review on floods in ghmc

హైదరాబాద్ నగరంలో భారీ వ‌ర్షాల‌తో దెబ్బతిన్న రోడ్ల త‌క్షణ మ‌ర‌మ్మ‌తుల‌కు రూ.297 కోట్లతో ప‌నులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటికే విద్యుత్ లేని ప్రాంతాల్లో 24 గంట‌ల్లో కరెంట్ సరఫరాకు చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆ శాఖను ఆదేశించారు. వర్షాలకు దెబ్బతిన్న సివ‌రేజి, వాట‌ర్ పైప్‌లైన్ల పున‌రుద్ధర‌ణ ప‌నులు‌ హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ వ‌ర్క్స్​చే రూ.50 కోట్ల‌తో చేపట్టాలన్నారు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ట్యాంక‌ర్ల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా చేయాలని అధికారులను ఆదేశించారు.

minister ktr review on floods in hyderabad
వర్షాలు, వరదలపై కేటీఆర్​ సమీక్ష... రోడ్ల మరమ్మతులకు రూ.297కోట్లు
author img

By

Published : Oct 16, 2020, 7:56 PM IST

Updated : Oct 16, 2020, 8:05 PM IST

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వర్షాలు, వరదలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిన అపార్ట్‌మెంట్‌లు, కాల‌నీల‌కు 24 గంట‌ల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాను పున‌రుద్ధరించుట‌కు స‌మ‌న్వయంతో వ్యవ‌హ‌రించాల‌ని జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ‌ల అధికారుల‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. భారీ వ‌ర్షాల‌తో దెబ్బతిన్న రోడ్ల త‌క్షణ మ‌ర‌మ్మతుల‌కు రూ.297 కోట్ల‌తో ప‌నులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

వర్షాలు, వరదలపై కేటీఆర్​ సమీక్ష... రోడ్ల మరమ్మతులకు రూ.297కోట్లు

వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లోని ప్రజ‌ల‌కు ట్యాంక‌ర్ల ద్వారా మంచినీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని వాట‌ర్ వ‌ర్క్స్​ అధికారుల‌కు స్పష్టం చేశారు. అలాగే రూ.50 కోట్ల‌తో దెబ్బతిన్న సివ‌రేజి, వాట‌ర్ పైప్‌లైన్ల పున‌రుద్ధరణ ప‌నులు చేప‌ట్టాల‌ని తెలిపారు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్​ను ఆదేశించారు. వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య శాఖ‌తో స‌మ‌న్వయం చేసుకొని వైద్య శిబిరాలు నిర్వహించాల‌ని సూచించారు.

వరద బాధితుల సహాయార్థం..

వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం ఒక నెల వేత‌నాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ప్రక‌టించిన‌ చెక్కును జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల ఆధ్వర్యం మంత్రి కేటీఆర్​కు అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయ‌న్న‌, బోర్డు సీఈవో అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో బోర్డు స‌భ్యులు కేటీఆర్​ను క‌లిశారు. వారితో చ‌ర్చించిన మంత్రి ర‌సూల్‌పురా నాలా అభివృద్ది ప‌నుల‌కు జీహెచ్ఎంసీ నిధుల నుంచి రూ.6 కోట్లు విడుద‌ల చేయ‌నున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ, నాలా చట్ట సవరణలకు గవర్నర్ ఆమోదం

Last Updated : Oct 16, 2020, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.