ETV Bharat / state

KTR Review On Rains : 'వర్షాకాలంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

author img

By

Published : Jun 27, 2023, 7:30 PM IST

KTR Review On Monsoon Issues In Hyderabad : రాష్ట్రంలోని పట్టణాలతో పాటు హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడడమే అధికారుల ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని పురపాలికలు చేపట్టిన వర్షాకాల సన్నద్ధత ప్రణాళికలపైన పురపాలక శాఖలోని పలు విభాగాల అధికారులతో సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Minister KTR
Minister KTR

KTR Review with GHMC officials on monsoon issues : వర్షాకాలం నేపథ్యంలో నగరంలో ఎదురయ్యే వరదలు, భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన అంశాలపైన మంత్రి కేటీఆర్ చర్చించారు. జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో మెజార్టీ పనులు పూర్తయ్యాయని, గత సంవత్సరంతో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పుతుందని ఎస్‌ఎన్‌డీపీ విభాగం అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాలలో అవసరమైన డివాటరింగ్ పంపులు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

నగర వ్యాప్తంగా ఉన్న చెరువులలో నీరు, పుల్ ట్యాంకు నిల్వలకు చేరకుండా వాటి నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే వర్షాకాల ప్రణాళికకు సంబంధించి గత కొంతకాలంగా పురపాలికలు అన్నీ ఏర్పాట్లను చేసుకుంటున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. జీహెచ్ఎంసీతోపాటు ఇతర పురపాలికల్లో నాలాల సేఫ్టీ ఆడిట్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. నగరంలో ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా చర్చించారు.

ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉన్నదని.. ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రతిరోజు వార్డు కార్యాలయ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కోరారు. వార్డు కార్యాలయ వ్యవస్థను నగర పౌరులు విస్తృతంగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు.

KTR Review with ward office staff : వార్డు కార్యాలయ వ్యవస్థ మరింతగా మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకునేలా ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వార్డు కార్యాలయ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అన్ని విభాగాల అధికారులు రానున్న కొన్ని వారాలపాటు ప్రత్యేకంగా అంతర్గత సమీక్షలు నిర్వహించుకొని, వార్డు కార్యాలయ వ్యవస్థ పనితీరును బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు నగర పౌరులతో ఫోన్లో మాట్లాడారు.

జీహెచ్ఎంసీకి పలు సమస్యలపైన ఫిర్యాదు చేసిన వీరికి, ఆయా సమస్యల పరిష్కారం జరిగిన తీరు, ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ నుంచి ఎదురైన అనుభవాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాల విషయంలో జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసిన తరువాత.. ఆ సమస్యను పరిష్కరించి అందుకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకున్నట్లు గాజుల రామారాంకి చెందిన రామ్.. అనే వ్యక్తి కేటీఆర్‌కు తెలిపారు. మంత్రి స్వయంగా ఫోన్ చేయడం పట్ల పౌరులు హర్ష వ్యక్తం చేశారు. జలమండలి చేపట్టిన ప్రాజెక్టులు, ఉచిత నీటి సరఫరా, ఫిర్యాదుల పరిష్కారం వంటివాటిపై మంత్రి సమీక్షించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.