హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం జరుగుతోన్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు సాగాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. బుద్ధభవన్‌లో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్‌లతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద చేపట్టిన పనుల ప్రగతిని మంత్రి సమీక్షించారు.
వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ను ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పమని కేటీఆర్ పేర్కొన్నారు. వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్రోడ్లలో అక్కడక్కడా ఆటంకంగా ఉన్న భూముల సేకరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో నిర్వాసితుల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు.
హైదరాబాద్ నగర మాస్టర్ ప్లాన్‌ను అప్డేట్ చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి.. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు. నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలతో పాటు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఆ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకునే అవకాశం!