ETV Bharat / state

తెలంగాణకు 8ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్‌ - KTR press meet

Minister KTR review meeting with IT department officials: రాష్ట్రంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వం వచ్చిన తరవాత విలువైన పెట్టుబడులు వచ్చాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఐటీ సంస్థలు వస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కృషితో లక్షలాది మందికి ఉపాధి లభించిందని అన్నారు.

KTR
కేటీఆర్​
author img

By

Published : Jan 2, 2023, 7:30 PM IST

Updated : Jan 2, 2023, 7:38 PM IST

Minister KTR review meeting with IT department officials: 2014 నుంచి గత నెల నవంబర్ వరకు తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ.3 లక్షల 30 వేల కోట్లు విలువైన పెట్టుబడులు వచ్చినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పాలనలో పారదర్శకత, సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో కార్యరూపం దాల్చిన టీఎస్ ఐపాస్‌తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. 8 ఏళ్లుగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, భవిష్యత్‌లో రానున్న పెట్టుబడులపై పరిశ్రమలు-ఐటీ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రానికి ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం తమ ప్రభుత్వం సాధించిన ఘన విజయమని ప్రకటించారు మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్యం, ఇతర రంగాల్లోకి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే వాటి విలువ మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషితో లక్షలాది మందికి ఉపాధి లభించిందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యక్రమాలు, ప్రాజెక్టుల పైన సుదీర్ఘంగా చర్చించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 2, 2023, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.