ETV Bharat / state

KTR Latest News : 'హైదరాబాద్‌లో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు' - Ten Year Report of Municipal Administration

Municipal Department Decade Report : హైదరాబాద్‌లో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. భవిష్యత్తులో భాగ్యనగరానికి నిత్యం మంచినీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పురపాలకశాఖలో జరిగిన అభివృద్ధి నివేదికను కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ ద్వారా రూ.లక్షా 21వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే ఎస్‌ఆర్‌డీపీ ద్వారా 35 వరకు ఫ్లైఓవర్‌లు నిర్మించామన్నారు.

KTR
KTR
author img

By

Published : Jul 5, 2023, 3:15 PM IST

Updated : Jul 5, 2023, 4:25 PM IST

KTR Released Municipal Department Decade Report : పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన బేగంపేట మెట్రోభవన్‌లో తెలంగాణ ఏర్పాడిన తరువాత పురపాలక శాఖ సాధించిన విజయాలు, అభివృద్ధి నివేదికను కేటీఆర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ ద్వారా రూ.లక్షా 21వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. అంతకుముందు ప్రభుత్వాలు అప్పట్లో రూ. 26వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో పురపాలక శాఖ కోసం 462శాతం ఎక్కువ నిదులు ఖర్చు చేశామన్నారు.

Electric buses in Hyderabad : హైదరాబాద్‌లో అన్ని ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్‌ బస్సులుగా మారుస్తామని ప్రకటించారు. అలాగే భాగ్యనగరంలో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు. 111 జీవో ఎత్తివేతకు విధివిధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. నగర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామని అన్నారు. ఎస్‌ఆర్‌డీపీ ద్వారా 35 వరకు ఫ్లైఓవర్‌లు నిర్మించామని గుర్తు చేసుకున్నారు. కానీ ఉప్పల్‌, అంబర్‌పేట ఫ్లైఓవర్లను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయలేకపోతోందని మండిపడ్డారు.

తమ ప్రభుత్వం 35 ఫ్లైఓవర్లు పూర్తి చేస్తే.. కేంద్ర ప్రభుత్వం 2 ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. పురపాలక శాఖకు కేంద్రం కూడా 26 అవార్డులను ఇచ్చి గుర్తించిందని సంతోషం వ్యక్తం చేశారు. కొత్త పురపాలక చట్టం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. ఈ పదేళ్లలో చట్టబద్ధంగా రావాల్సింది తప్ప కేంద్రం రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని ఆరోపించారు.

ఏ రంగం తీసుకున్నా గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేసినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ పదేళ్లలో గణనీయమైన గుణాత్మకమైన తేడా కనిపిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ఏర్పడి పదో ఏడాదిలో అడుగుపెట్టినట్లు గుర్తు చేశారు. ఏటా జూన్‌లో వార్షిక ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని.. ఈసారి పురపాలకశాఖ దశాబ్ది నివేదికను విడుదల చేశామని కేటీఆర్‌ తెలిపారు.

"స్కైవేలకు భూములివ్వాలని ఐదుగురు రక్షణశాఖ మంత్రులను కోరాం. ఇటీవలే అమిత్‌షా సమయం ఇచ్చి.. మెుహం చాటేశారు. మెట్రో అనుసంధానం ఉండేలా 2 స్కైవేలను డబుల్‌ డెక్కర్‌లుగా నిర్మిస్తాం. సహకరించే ప్రభుత్వం కేంద్రంలో వస్తే స్కైవేలు నిర్మిస్తాం. పాతబస్తీలో ఎల్‌ అండ్‌ టీ మెట్రో నిర్మించకపోతే ప్రభుత్వమే నిర్మిస్తుంది. మెట్రో కోచ్‌లు పెంచాలని కోరాం. బండ్లగూడా ఘటన చాలా ప్రమాదకరం. కంటోన్మెంట్‌ విలీన అంశం కేంద్రం ప్రభుత్వం పరిధిలో ఉంది."- కేటీఆర్‌, పురపాలకశాఖ మంత్రి

'హైదరాబాద్‌లో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు'

ఇవీ చదవండి:

Last Updated : Jul 5, 2023, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.