వీక్షకులకు వినోదం ఇవ్వడంలో ఓటీటీ విజయవంతమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR Comments) అన్నారు. ఓటీటీ, గేమింగ్‌కు ఆదరణ పెరుగుతోందని తెలిపారు. తాను కూడా ఓటీటీకి అభిమానినేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫెస్టివల్ 'ఇండియా జాయ్'(India Joy program) ప్రారంభ కార్యక్రమానికి హాజరైన మంత్రి... ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమం అని కొనియాడారు.
దేశంలో రోజురోజుకూ ఇంటర్నెట్ యూజర్లు పెరుగుతున్నారని మంత్రి(KTR Comments) వెల్లడించారు. ఇమేజ్ సెక్టార్ ఏడాదికి 13.4 శాతం పెరుగుతోందని అంచనా వేశారు. రెండేళ్లలో కొత్తగా 10 వీఎఫ్‌ఎక్స్ సంస్థలు కొలువుదీరాయన్న మంత్రి... ప్రస్తుతం హైదరాబాద్‌లో 80 వీఎఫ్‌ఎక్స్ సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా నగరంలో అనేక గేమ్స్ రూపొందాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇమేజ్ టవర్‌ను 2023లో ప్రారంభించేలా కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.
ఇదీ చదవండి: Bandi sanjay news: చివ్వెంలలో ఉద్రిక్తత.. రాళ్లు రువ్వుకున్న భాజపా, తెరాస కార్యకర్తలు