ETV Bharat / state

KTR Open Letter : పాలమూరు-రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు ఇవ్వండి.. కేటీఆర్​ బహిరంగ లేఖ

KTR Open Letter For Palamuru Ranga Reddy : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం రెండో దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతూ మంత్రి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరిత వైఖరి అవలంభిస్తుందని ఆరోపించారు.

KTR
KTR
author img

By

Published : Jul 13, 2023, 8:49 PM IST

Minister KTR Open Letter To Central Govt : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరిత వైఖరి కనబరుస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రగతి, పురోగతిని ఓర్వలేక తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాన్ని తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తోందని ఆక్షేపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో లేఖ రాస్తున్నట్లు కేటీఆర్​ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించేలా ప్రధాని మోదీ స్వయంగా పలుమార్లు మాట్లాడారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురైన అన్ని ఆటంకాలను దాటుకొని.. తనదైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతోందని వివరించారు. అయితే రాష్ట్ర ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్రం.. తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాన్ని గత తొమ్మిదేళ్లుగా కొనసాగిస్తూనే ఉందని కేటీఆర్ మండిపడ్డారు.

  • ఇదేం న్యాయం?
    అన్ని హామీలు ఇచ్చిన తెలంగాణ.
    అయినప్పటికీ...
    పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి నిరాకరణ!

    కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఆది నుంచీ తెలంగాణపై కక్ష
    మన రాష్ట్ర ప్రాజెక్టులపై అంతులేని వివక్ష.

    అమ్మ పెట్టదు
    అడుక్కు తిననివ్వదు అన్నట్టు
    సాగు, తాగు నీటి… pic.twitter.com/ECj6vNPP7C

    — KTR (@KTRBRS) July 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR Comments On Central Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదుల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంశంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టుకు రెండోదశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా పక్కనపెట్టిన కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ లేఖలో తెలిపారు.

పక్కనే ఉన్న కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం మొండిచేయి చూపించడం తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనమని కేటీఆర్​ ఘాటుగా వ్యాఖ్యానించారు. కృష్ణా జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తోందన్నారు. దీంతో సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టివేసిందని ఆవేదన చెందారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు ఖండించాలి : కృష్ణా జలాల్లో 500 టీఎంసీల వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోకుండా.. కనీసం ట్రైబ్యునల్​కు పంపకుండా తొమ్మిదేళ్ల తర్వాత కూడా నాన్చివేత వేట ధోరణిని అవలంభిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అడ్డుకునే ఎలాంటి శక్తులనైనా రాజీ పడకుండా ఎదుర్కొంటామని మంత్రి స్పష్టం చేశారు. పక్షపాత నిర్ణయాలు, వివక్షాపూరిత వైఖరితో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటూ, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.