జీహెచ్‌ఎంసీ చట్టానికి ఐదు సవరణలు ప్రతిపాదించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జవాబుదారీతనం, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చట్టసవరణ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసినట్లు వివరించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ ప్రకటించారు.
2015లోనే జీహెచ్‌ఎంసీలో 50 శాతం స్థానాలను మహిళలకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. ప్రత్యేక జీవో తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. 79 స్థానాల్లో మహిళలను గెలిపించిన ఘనత తెరాసకే దక్కిందన్నారు.