ETV Bharat / state

టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

పట్టణ ప్రాంతాల్లో భవననిర్మాణం, లే అవుట్ల సత్వర అనుమతుల కోసం టీఎస్​-బీపాస్‌ అమలులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ ప్రారంభించిన ఈ వెబ్​సైట్​లో... దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయనున్నారు.

ts b pass
టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
author img

By

Published : Nov 16, 2020, 12:10 PM IST

మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో టీఎస్‌బీపాస్‌ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించారు. నేటి నుంచి అమలులోకి రానున్న ఈ వెబ్​సైట్​లో పట్టణాల్లో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులను పొందవచ్చు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాష్లల్లో వెబ్​సైట్ అందుబాటులో ఉండనుంది.

దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణ అనుమతికి జారీ ఇవ్వనున్నారు. నిర్దేశించిన గడువులోగా టీఎస్‌బీపాస్ ద్వారా అనుమతులు, ధ్రువపత్రాల జారీ చేయనున్నారు. భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులు సరళంగా, నిర్ధేశిత గడువులోగా వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్​ బీ-పాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా నిర్దేశించిన గడువులోగా అనుమతులు పొందడమే దీని ప్రధాన ఉద్దేశం.

ఇదీ చూడండి: ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.