ETV Bharat / state

హైదరాబాద్‌ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది: మంత్రి కేటీఆర్ - హైదరాబాద్ నగర వార్తలు

KTR Comments on Hyderabad: హైదరాబాద్ శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నగర పరిధిలో 50 చెరువుల పునరుద్ధరణను కార్పొరేట్ కంపెనీలు దత్తత తీసుకున్నాయి. ఇందులో భాగంగా సీఎస్‌ఆర్‌ ఫండ్ కింద అభివృద్ది చేసిన ఖాజాగూడ పెద్ద చెరువును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

minister ktr inaugurated pedda cheruvu in hyderabad
'చెరువుల అభివృద్ధి కోసం రూ.కోటి.. ఖాజాగూడ పెద్ద చెరువు ప్రారంభం'
author img

By

Published : Mar 28, 2023, 5:55 PM IST

KTR Comments on Hyderabad: నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగరం రోజురోజుకూ విస్తరిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో చెరువుల అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నగర పరిధిలో 50 చెరువుల పునరుద్ధరణను కార్పొరేట్ కంపెనీలు దత్తత తీసుకున్నాయి. ఇందులో భాగంగా సీఎస్‌ఆర్‌ ఫండ్ కింద అభివృద్ది చేసిన ఖాజాగూడ పెద్ద చెరువును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలకు ఒప్పంద పత్రాలను మంత్రి అందజేశారు.

చెరువుల అభివృద్ధి కోసం రూ.కోటి..: ఈ సందర్భంగా హైదరాబాద్ నగరం చాలా అభివృద్ది చెందిందని విదేశీయులు చెబుతున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నగరంలోని 50 చెరువులను అభివృద్ది చేస్తామని పెద్ద కంపెనీలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. చెరువుల అభివృద్ది కోసం కంపెనీలు రూ.కోటి ఖర్చు పెడుతున్నాయని మంత్రి తెలిపారు.

మెట్రోను విస్తరిస్తాం..: ఈ క్రమంలోనే నగరంలో 200 ఎకరాల్లో ఫాక్స్‌ కాన్ యూనిట్ పెడుతున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఫాక్స్‌ కాన్‌ కంపెనీ వల్ల 30 వేల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. గతేడాదిలో ఐటీలో లక్షా 50 వేల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కేంద్రాన్ని కోరితే.. ఆ ఏరియాల్లో వీలు కాదంటూ సమాచారం వచ్చిందన్నారు. కేంద్రం సహకరించినా.. సహకరించకపోయినా మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.

"చెరువుల సుందరీకరణ, అభివృద్ధితో పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే క్రమంలో కార్పొరేట్ కంపెనీలను భాగస్వాములను చేస్తూ సామాజిక బాధ్యతలో భాగంగా వారితో ఖర్చు పెట్టిస్తున్నాం. ఎక్కడా కూడా చెరువులను పూడ్చి బిల్డింగులను కట్టడం లాంటి వాటికి తెర తీయడం లేదు. ఓఆర్‌ఆర్‌​ మీదుగా హైదరాబాద్​లోకి వస్తుంటే వెస్టర్న్ కంట్రీలోకి వచ్చిన ఫీల్ వస్తుంది. ఇదంతా ఊరికే రాలేదు. ప్రస్తుతం హైదరాబాద్​లో 900 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారవుతుంది. వచ్చే సంవత్సరం వరకు 1400 కోట్ల డోసుల వ్యాక్సిన్ల ఉత్పత్తి ఇక్కడే జరగబోతుంది. హైదరాబాద్​లో ఫార్మాసిటీ కూడా వస్తే దీనికి అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ప్రజా రవాణా అనేది చాలా కీలకం. కేంద్ర ప్రభుత్వం సహకరించినా, లేకపోయినా మేము మెట్రోను పొడిగిస్తాం." - మంత్రి కేటీఆర్

'చెరువుల అభివృద్ధి కోసం రూ.కోటి.. ఖాజాగూడ పెద్ద చెరువు ప్రారంభం'

నగరంలో శాంతి భద్రతలు బాగున్నాయని.. నగర అభివృద్దిలో భాగస్వాములవుతామని ట్రెడా అధ్యక్షులు సునీల్ చంద్రారెడ్డి స్పష్టం చేశారు. చెరువుల వద్ద ఎస్‌టీపీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, విప్ గాంధీ, మేయర్ గద్వాల విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.