ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతం ఎంస్ మక్తాలో పర్యటించిన మంత్రి బాధితులకు ప్రభుత్వం తరపున 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడు నుంచి 4లక్షల బాధిత కుటుంబాలకు సాయం ఇస్తామన్నారు. ఆర్థిక సాయం ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందిపడ్డ ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు..
విపత్కర సమయంలో ఎమ్మెల్యే , కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోషియేషన్‌లు, ఎన్జీవోలు కలిసి కట్టుగా ప్రజలకు సాయం అందేలా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ బొంతు రామ్మోహన్ బాధితులను పరామర్శించారు. అనంతరం ఫిల్మ్‌నగర్‌లోనూ బాధితులకు మంత్రి సాయం అందించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష