ETV Bharat / state

ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు: కేటీఆర్

ఎల్బీ స్డేడియం​లో దివ్యాంగులకు మంత్రి కేటీఆర్... ఉచితంగా​ ఉపకరణాలు పంపిణీ చేశారు. 24 కోట్ల రూపాయల విలువైన పరికరాలను దివ్యాంగులకు అందజేశారు.

Minister KTR, LB Nagar
ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు: కేటీఆర్
author img

By

Published : Apr 16, 2021, 1:24 PM IST

Updated : Apr 16, 2021, 1:35 PM IST

హైదరాబాద్ ఎల్బీస్డేడియంలో మంత్రి కేటీఆర్ దివ్యాంగులకు ఉచితంగా సహాయ పరికరాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.

దివ్యాంగుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. శారీరక ఇబ్బందుల్లో ఉన్న దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ కృషిని కేంద్రం గుర్తించిందని వెల్లడించారు. దివ్యాంగుల కృత్రిమ పరికరాల తయారీ పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

దివ్యాంగులకు వరాలు

చదువుకునే దివ్యాంగ విద్యార్థుల కోసం మూడు వందల ల్యాప్​టాబ్స్, నాలుగు వందల స్మార్ట్ ఫోన్స్​ అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ వీల్​ ఛైర్స్​ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 24 కోట్ల 34 లక్షలతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. 5 శాతం రిజర్వేషన్​లను దివ్యాంగులకు ఇస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.

దివ్యాంగుల కోసం కృషి

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని వర్గాలను కేసీఆర్ అభివృద్ధి పరిచారని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. దివ్యాంగుల కోసం ఎన్నడూ లేని విధంగా వారి అవసరాలను కేసీఆర్ తీర్చారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడువేల ఫించన్లను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. రాష్ట్రంలో పది లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు స్పష్టం చేశారు. 24 కోట్లతో 17వేల మంది దివ్యాంగుల అవసరాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ... దివ్యాంగుల ఫించన్లను 5 వందల రూపాయల నుంచి 3వేలకు పెంచారని హోంమంత్రి మహమూద్​ అలీ పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీలో 4 శాతం రిజర్వేషన్ కల్పించారని తెలిపారు.

Last Updated : Apr 16, 2021, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.