ETV Bharat / state

త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కేటీఆర్​ - minister comments of bjp government

త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆరున్నరేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని, మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి పోగొట్టామని స్పష్టం చేశారు.

minister ktr
మంత్రి కేటీఆర్​
author img

By

Published : Mar 9, 2021, 2:02 PM IST

Updated : Mar 9, 2021, 6:08 PM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఆరున్నరేళ్లలోనే అనేక సమస్యలు పరిష్కరించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. స్విస్​ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొస్తామని ఊదరగొట్టిన కేంద్రం.. ఇప్పటివరకు పైసా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని సంస్థలను కూడా తెలంగాణకు ఇవ్వలేదని ఆరోపించారు. మహబూబ్​నగర్​, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా హైదరాబాద్​లోని ప్రైవేటు కళాశాలలో సమావేశం నిర్వహించారు.

'హైదరాబాద్‌లోని ఎన్‌ఐడీని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. కేంద్రాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్​ రీసెర్చ్ సెంటర్ అడిగితే ఇవ్వలేదు. ఆరు వైద్య కళాశాలలను ఇవ్వాలని కోరితే స్పందన లేదు. భాజపా నేతలు నినాదాలు మాత్రమే ఇస్తారు.. హామీలు నెరవేర్చరు.'

కేటీఆర్​, ఐటీ శాఖ మంత్రి

ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు.

త్వరలోనే 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: కేటీఆర్​

ఇదీ చదవండి: ఎన్నికల్లో ఎవరూ తప్పుడు ఓట్లు వేయొద్దు : కోదండరాం

Last Updated : Mar 9, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.