ETV Bharat / state

Minister KTR America Tour Update : హైదరాబాద్​లో గ్లోబల్​ కేపబిలిటీ సెంటర్​ను ఏర్పాటు చేయనున్న మెట్ లైఫ్​ సంస్థ - మెడ్​ లైఫ్​ సంస్థ హైదరాబాద్​లో పెట్టుబడులు

Minister KTR America Tour Update : తెలంగాణ వేదికగా.. కార్యకలాపాల విస్తరణకు మరో అంతర్జాతీయ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, బీమా సేవల సంస్థగా ఉన్న మెట్‌లైఫ్‌.. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. భాగ్యనగరంలో సేవల విస్తరణకు గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ సంస్థ ప్రణాళికలను ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ ఆ రెండు సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Medlife Will Invest In Hyderabad
Minister KTR America Tour
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 10:28 PM IST

Updated : Aug 25, 2023, 6:55 AM IST

Minister KTR America Tour Update : వివిధ అంతర్జాతీయ దిగ్గజ సంస్థల.. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలకు హైదరాబాద్‌ చిరునామాగా మారింది. గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్ సంస్థ- జీహెచ్​ఎక్స్.. హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటుకి మందుకొచ్చింది. హైదరాబాద్‌లో ఆరోగ్య రంగానికి రంగానికి అనుకూల వాతావరణం ఉందని.. ముఖ్యంగా మానవ వనరులతో పాటు అనేక సంస్థల సమ్మిళిత ఈకో సిస్టం ఉందని తెలిపింది. జీహెచ్​ఎక్స్(GHX) సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు.

Metlife Will Invest In Hyderabad : హెల్త్‌ కేర్ రంగం డిజిటల్ దిశగా ప్రయాణం మొదలు పెట్టిందని.. అందులో భాగంగా హెల్త్‌ కేర్ కంపెనీలు పెద్దఎత్తున డిజిటలీకరణ, ఐటీ ఆధారిత సేవలపై విస్తృతంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని.. జీహెచ్​ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజేసింగ్ తెలిపారు. ఆ దిశలోనే హైదరాబాద్‌ విస్తరణ ప్రణాళికలు, గ్లోబల్ కేపబిలిటీ కేంద్రం ద్వారా లక్ష్యాలను అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2025 నాటికి ప్రస్తుత కార్యకలాపాల్ని మూడింతలు చేసే లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలు చేపడుతుందని.. జీహెచ్​ఎక్స్ తెలిపింది.

KTR On Sultanpur Medical Devices Park : 'మెడ్‌టెక్ రంగంలో మరో మైలురాయిని తెలంగాణ అధిగమించింది'

Global Health Care Exchange Organization In Hyderabad : హైదరాబాద్‌ కేంద్రంగా ఇంజనీరింగ్ ఆపరేషన్ కార్యకలాపాలు విస్తరిస్తామని.. ఇన్నోవేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆ విస్తరణ ఉంటుందని సంస్థ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో తెలిపింది. హెల్త్‌ కేర్, ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగానికి చేయూతను అందిస్తూనే.. ఐటీ ఆధారిత కార్యకలాపాలను పెద్దఎత్తున హైదరాబాద్‌కి ఆకర్షించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలను బలోపేతంచేసే దిశగా జీహెచ్​ఎక్స్ విస్తరణ ప్రణాళికలను ప్రకటించడంపై కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

Minister KTR America Tour
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్​

TCL invest in Telangana : తెలంగాణలో టీసీఎల్​ పెట్టుబడులు.. రూ. 225 కోట్లతో ఎలక్ట్రానిక్స్​ తయారీ ప్లాంట్​

ప్రపంచంలోనే అత్యధిక మందికి భీమా, ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థగా పేరొందిన మెట్‌ లైఫ్‌.. తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని... హైదరాబాద్‌లో స్థాపించేందుకు ముందుకొచ్చింది. న్యూయార్క్‌లోని మెట్‌ లైఫ్ కేంద్రకార్యాలయంలో సంస్థ సీనియర్‌ ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

అమెరికా ఫార్చ్యూన్ 500 జాబితాలోని అంతపెద్ద సంస్థ.. భాగ్యనగరంలో కేంద్రం ఏర్పాటు చేయడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేలా.. మెట్‌ లైఫ్ నిర్ణయం దోహదం చేస్తుందన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, భీమారంగాల బలోపేతానికి రాష్ట్రం ఏర్పడినప్పటి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి.. అనేక దిగ్గజ తరలివస్తున్నాయని కేటీఆర్ వివరించారు.

Met Life Company In Hyderabad : ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు(International Organizations) ఆ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా విస్తృతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని.. ఆ దిశగా మెట్‌ లైఫ్ సంస్థను స్వాగతిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. న్యూయార్క్‌లో విద్యార్థి, ఉద్యోగిగా పనిచేస్తున్నప్పడు మెట్‌ లైఫ్ కేంద్రకార్యాలయ భవనరాజసం, నిర్మాణ శైలి తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో సొంత రాష్ట్రానికి పెట్టుబడులని కోరుతూ సమావేశంకావడం అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని మెట్‌ లైఫ్ సీనియర్ ప్రతినిధుల బృందంతో జరిగిన సమావేశంలో కేటీఆర్ తన స్పందనను ప్రస్తావించారు.

Goldman Sachs To Invest In Telangana : రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్న గోల్డ్​మెన్​ సాచ్

KTR Tweet On Foxconn : రాష్ట్రంలో ఫాక్స్​కాన్​ మరో 400 మిలియన్​ డాలర్ల పెట్టుబడి.. కేటీఆర్​ ట్వీట్​

Last Updated : Aug 25, 2023, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.