ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ నగరంతోపాటు పరిసర వరద బాధితులకు ఈ రోజు నుంచి ఆర్థిక సాయం అందిస్తామని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. మూడు నుంచి 4లక్షల బాధిత కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందజేస్తామని వెల్లడించారు. ఈ సాయాన్ని ఇంకా పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రతీ కుటుంబానికీ...
వర్షాల వల్ల ఇబ్బందిపడ్డ ప్రతి కుటుంబానికి ఈ సాయం అందించాలని సీఎం ఆదేశించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజా ప్రతినిధులు, రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోషియేషన్‌లు, ఎన్జీవోలు కలిసి కట్టుగా ప్రజలకు సాయం అందేటట్లు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష