లూయిస్ బ్రెయిలీ కృషి వల్ల అంధుల జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. అంధుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ 212వ జయంతి ఉత్సవాలను మలక్‌పేట్‌లోని వికలాంగుల సంక్షేమ శాఖ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ లిపి వల్ల ప్రపంచంలో అంధులు సాధారణ పౌరులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. అంధులమని బాధ పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. కరోనా వల్ల భౌతిక దూరం పాటిస్తూ బ్రెయిలీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ, ఛైర్మన్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.