ఎస్సీ ఉప కులాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఉపకులాలకు చెందిన పలువురు నేతలు.. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో కొప్పుల ఈశ్వర్‌ను కలిశారు. దాదాపు రెండు గంటల పాటు నేలపై కూర్చొని వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఎస్సీ ఉపకులాల వారి కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుతో పాటు కుల ధ్రువీకరణ పత్రాల జారీ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించే అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకుని.. మినీ డైరీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి తప్పక సహాయం చేస్తానని కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు