క్రిస్మస్ వేడుకల నిర్వహణపై మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీరాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ ఐదో తేదీ లోపు అన్ని జిల్లాలకు క్రిస్మస్ గిఫ్ట్ పాకెట్ల సరఫరా పూర్తి చేయాలన్నారు. 10లోపు పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. క్రిస్టియన్లలో ప్రముఖులైన 12 మంది వ్యక్తులు, ఆరు సంస్థలను ఎంపిక చేసి అవార్డులివ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే విందు ఏర్పాట్లపై ప్రత్యేకశ్రద్ధ చూపాలని చెప్పారు. డిసెంబర్ 20 నాటికి క్రిస్టియన్ భవన్కు పునాదిరాయి వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్మశానవాటికల కోసం పది చోట్ల 63 ఎకరాల స్థలాన్ని డిసెంబర్ నెలాఖరు వరకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం