ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన కోటివృక్షార్చనలో మంత్రి కొప్పుల ఈశ్వర్ భాగస్వాములయ్యారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మొక్కలు నాటారు.
ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అధినేత జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని తెలిపారు. భావితరాలకు మనం ఇవ్వగల గొప్ప కానుక... పచ్చదనం, మంచి వాతావరణం, ఆరోగ్యకరమైన పర్యావరణమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కేసీఆర్కు అరుదైన బహుమతి.. జోరుగా 'కోటి వృక్షార్చన'